భారత్ ఓపెన్ మార్కెట్లోకి కరోనా 'టీకా'లు ఎప్పుడోస్తాయంటే ?

Update: 2020-12-24 13:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారతదేశంలోని ఓపెన్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ ‌లను ఏప్రిల్ నుంచి జూన్ మధ్యనెలల్లో అందుబాటులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ధరలను నియంత్రించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాలు గుర్తించిన ప్రాధాన్యత గ్రూపులు మాత్రమే కాకుండా, టీకా కొనే ప్రైవేట్ పౌరులను కూడా వ్యాక్సిన్ వేయడానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మల్టీ వ్యాక్సిన్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

జనవరి చివరి నాటికి కనీసం ఒక వ్యాక్సిన్‌ ను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీకాలు మొదట్లో పరిమిత పరిమాణంలో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. మార్చి-ఏప్రిల్ నాటికి మరిన్ని వ్యాక్సిన్లు ఆమోదించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. జాతీయ టీకా కార్యక్రమానికి బయట కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఫేజ్-3 ట్రయల్స్ ‌లో నాలుగు డ్రగ్ మేకర్లు భారత మల్టీ వ్యాక్సిన్ వ్యూహాన్ని వినియోగించుకోనున్నాయి. వ్యాక్సినేషన్ ప్రారంభంలో టీకాల పంపిణీ సవాలుగా మారనుంది. అందుకే ప్రభుత్వం వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వం ప్రాధాన్యత లక్ష్యాలను చేరుకున్న తర్వాత పబ్లిక్ ఇమ్యునైజేషన్ వెలుపల ప్రైవేట్ కొనుగోలుకు ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని, ఏప్రిల్-జూన్ మధ్య నెలల్లో జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే , ప్రస్తుతం భారతదేశంలో 5 వ్యాక్సిన్లు హ్యుమన్ ట్రయల్స్ లో ఉన్నాయి. సీరం (ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ ), భారత్ బయోటెక్ (కోవాక్సిన్, ICMR), డాక్టర్ రెడ్డి / RDIF (స్పుత్నిక్-V) జైడస్ కాడిలా అనే నాలుగు కంపెనీల టీకాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. మార్చి నాటికి, ట్రయల్స్ విజయవంతమైతే.. ఇండియాలో మొత్తం 500 మిలియన్ల వరకు డోస్‌లు రెడీ అయినట్టే.బయోఎంటెక్‌తో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు యుఎస్ రెగ్యులేటరీ అథారిటీ ఆధారంగా ఫైజర్ భారతదేశంలో మార్కెటింగ్ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది. టీకాలకు బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Tags:    

Similar News