కరోనా గర్భిణి ఇప్పుడు వైరల్.. ఎందుకంటే?

Update: 2020-08-01 03:45 GMT
మహరాష్ట్రలో ఒక అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. మాయదారి కరోనా కేసులు భారీగా నమోదయ్యే ఆ రాష్ట్రంలో ఒక గర్భిణి మాయదారి రోగం బారిన పడ్డారు. నెలలు నిండిన ఆమె ఈ రోజు పండంటి ఇద్దరు కవలల్ని కనటం ఆసక్తికరంగా మారింది. కవలలుగా జన్మించిన ఈ ఇద్దరి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మహారాష్ట్రలోని ఫూణె మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒక ఆసుపత్రిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

29 ఏళ్ల ఆ గర్భిణికి ఇటీవల కరోనా సోకింది. నెలలు నిండిన ఆమెను ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఫూణెలోని సోనావనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శ్రావణశుక్రవారం నాడు.. ఇద్దరు ఆడపిల్లల్ని కనటం విశేషం. తల్లీ.. ఇద్దరు పసికందులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

అయితే..పుట్టిన పిల్లలకు కరోనా పాజిటివా? లేదా? అన్న విషయం మీద స్పష్టత రావాల్సి ఉంది. ఇద్దరు చిన్నారుల్ని వారి ఇంటి పెద్దలు పీపీఈ కిట్లతో ఎత్తుకొని దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలోనూ పలువురు గర్భిణులకు ప్రసవం చేశారు. వారిలో కొందరు పిల్లలు కరోనా నెగిటివ్ రాగా.. కొందరు మాత్రం పాజిటివ్ గా వచ్చారు. అయితే.. వారంతా క్షేమంగా బయటపడటం గమనార్హం.
Tags:    

Similar News