వైరల్ వీడియో: కరోనా బాధితుల్ని ఇలా కాల్చేశారు

Update: 2020-02-16 11:52 GMT
చైనాలో పుట్టి ఆ దేశంతోపాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్’ను ఎదుర్కొనేందుకు చైనా దేశం ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే 1500మందికి పైగా అధికారికంగా మరణించగా.. 60వేలమందికి పైగా ఈ వ్యాధి సోకింది.

ఇటీవలే చైనా పక్కనున్న ఉత్తరకొరియా దేశంలో ‘కరోనా వైరస్ ’సోకిన అనుమానితుడిని కాల్చేసి చంపిన ఘటనపై ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా చైనా ప్రభుత్వం కూడా కరోనా బారిన పడ్డ వారిని చంపేసిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చైనాలో మాస్కులు ధరించిన పోలీసులు కరోనా బాధితులు అంటూ కొందరిని చంపేసిన వీడియోను ‘రిలయబుల్ ’ అనే సంస్థ వీడియో చేసింది. ఓ వ్యక్తి దాన్ని ట్విట్టర్ లో పెట్టడంతో వైరల్ గా మారింది. చైనా కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేక చంపేస్తోందా అన్న అనుమానాలను వ్యక్తం చేశారు.

అయితే వాస్తవానికి ఆ వీడియోను కొందరు ఎడిట్ చేశారని.. చైనాలో అలాంటి దారుణం జరగలేదని చైనా సర్కార్ వివరణ ఇచ్చింది.  ఓ మూడు సంఘటనలను జోడించి ఆ వీడియోను ఎడిట్ చేశారని పేర్కొంది. కరోనాకు సంప్రదాయ వైద్యంతో తగ్గిస్తున్నామని చైనా తెలిపింది.

వీడియో కోసం చూడంది
Tags:    

Similar News