కరోనా అప్డేట్ : అగ్రరాజ్యానిదే అగ్రస్థానం ... శవాల దిబ్బగా అమెరికా !

Update: 2020-04-16 07:50 GMT

కరోనా మహమ్మారి  అమెరికాను అతలాకుతలం చేస్తోంది. మరణాల్లో ఇప్పటికే చైనా, ఇటలీ , స్పెయిన్ లను దాటిపోయింది. రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 10 రోజుల నుంచి రోజుకు 2వేల మంది కరోనా తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనాతో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకోలేదు.  గడిచిన 24 గంటల్లో అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 2,569 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.

కాగా , తాజా లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 644,348 మందికి కరోనా నిర్దారణ కాగా ..కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 28,554కి చేరింది. మొత్తంగా చూస్తే ఒక రోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు , అత్యధిక మరణాలు కూడా అమెరికాలో సంభవిస్తున్నాయి. అమెరికాలోని మొత్తం కరోనా మరణాల్లో 11 వేలకుపైగా ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకూ 10,367 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ప్రపంచంలోని ఏ దేశానైనా కూడా శాసించే సత్తా ఉన్న అమెరికా కూడా కరోనా దెబ్బకి విలవిలలాడిపోతుండటం తో ఈ మహమ్మారి తీవ్రత ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే , ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,084,735 మంది కరోనా భారిన పడగా ..134,685 మంది మృతి చెందారు.

అయితే , మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ...కరోనా రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తున్న కూడా ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ప్రపంచం ఉండిపోయింది. కారణం కరోనా మహమ్మారికి సరైన వ్యాక్సిన్ లేకపోవడమే ..ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రయోగం చేస్తుంది. కరోనా కి సరైన వ్యాక్సిన్ వచ్చే వరకు దీన్ని అడ్డుకోవడం కష్టమే అని ఇప్పటికే WHO ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News