అగ్రరాజ్యంలో ఇప్పటికి గంటకు 103 మంది చొప్పున చనిపోతున్నారు
ప్రపంచానికే పెద్దన్న అమెరికా. అలాంటి ఆ దేశంలో కరోనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఆర్థికంగానే కాదు.. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయేలా చేయటంలో వైరస్ చేసిన దుర్మార్గం అంతా ఇంతా కాదు. నిమిషం గడిస్తే చాలు.. అమెరికాలో ఒకరు కరోనా కారణంగా మరణించటం నేటికి కొనసాగుతోంది. తాజాగా చూస్తే.. 24 గంటల వ్యవధిలో 2,494 మంది మరణించారు. అంటే.. గంటకు 103 మంది చొప్పున అమెరికా లో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటివరకూ కరోనా కారణంగా అమెరికాలో 54 వేల మంది మరణించారు. ఇప్పుడా దేశంలో వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య పది లక్షలకు చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు అమెరికాలోనే కావటం గమనార్హం. ఇంత భారీ నష్టం చోటు చేసుకున్నప్పటికి వైరస్ తీవ్రత తక్కువగా రాష్ట్ట్రాల్లో ఆంక్షల్ని ఎత్తివేసే దిశగా ఆలోచనలుచేస్తున్నారు. రానున్న రోజుల్లోకేసుల నమోదు తీవ్రత తగ్గిన పక్షంలో ఆంక్షల్ని పాక్షికంగా ఎత్తి వేయాలన్న ఆలోచనలో పలు రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ రోజు నుంచి టెన్నెస్సీలో రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. మిస్సౌరీలో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు స్టార్ట్ కానున్నాయి. ఇడహోలో ప్రార్థనా స్థలాల్లోకి ప్రజల్ని అనుమతించనున్నారు. జార్జియాలో సెలూన్లు.. స్పాలు స్టార్ట్ చేశారు. ఒక్లమాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అలస్కాలో రెస్టారెంట్లు తెరుచుకోవటంతో పాటు.. పలు బీచుల్లో కోలాహలం నెలకొంది.
ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కీలక రంగాల్ని పునరుద్దరించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. దాని ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రాటిక్ లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని గవర్నర్లు మాత్రం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయటం గమనార్హం. కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న న్యూయార్క్ లో ఆంక్షల్ని ప్రస్తుతానికి సడలించాలని అనుకోవటం లేదు. హవాయిలో జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా విధించిన ఆంక్షల్ని మే 31 వరకూ పొడిగిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు.
ఓవైపు కరోనా ఆంక్షల్ని ఎత్తివేసే దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటుంటే.. మరికొన్ని మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటివేళ అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పాలన్న కోరిక మంచిదే అయినా.. వైరస్ వ్యాప్తి నియంత్రణలో రాకుండానే ఆంక్షల్ని ఎత్తివేస్తే మాత్రం పరిస్థితులు ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకోలేవన్న వ్యాఖ్యలు చేయటం గమనార్హం.