దేవుడు వీసా వరమిచ్చినా.. అమెరికా తలుపులు తెరవలేదు
దేవుడు వరమివ్వగానే సరిపోదు.. పూజారి కరుణ అవసరం. లేకుంటే స్వామి వారి దర్శనం కాదన్న నానుడిని నిజం చేసేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డాలర్ డ్రీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన హెచ్ 1బీ వీసా ఓకే కావటమే పెద్ద విజయంగా పలువురు ఫీల్ అవుతుంటారు. అలాంటి వీసా అనుమతులు వచ్చేసిన తర్వాత కూడా మాయదారి రోగం పేరుతో బ్యాడ్ లక్ వెంటాడుతున్న వైనం ఇప్పుడో సమస్యగా మారింది.
లాటరీ రూపంలో లక్ తగిలి హెచ్ 1బీ వీసా మంజూరు అయినా.. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు వెళ్లలేని పరిస్థితి. మరికొద్ది నెలల్లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు.. మాయదారి రోగం కారణంగా ఆ దేశంలో పెరిగిన నిరుద్యోగంతో స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఓకే అన్న వీసాదారుల్ని దేశంలోని అనుమతిస్తే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ప్రశ్నగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో అమెరికా తన రాయబార కార్యాలయాల్ని మూసేసింది. దీంతో.. అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చినా.. వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ తో గడిచిన రెండు నెలలుగా హెచ్ 1బీ వీసాదారులు అమెరికాకు వెళ్లలేని పరిస్థితి. రెండు లక్షల మంది హెచ్ 1బీ వీసాల కోసం అప్లై చేసుకుంటే కేవలం 50 వేల మందికి మాత్రమే లక్ తగిలింది. దీనికి సంతోష పడాలో.. ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికాకు ఎప్పుడు వెళతామో తెలీని సందిగ్థ పరిస్థితికి బాధ పడాలో అర్థం కావట్లేదన్న వాదన వినిపిస్తోంది.
సాధారణంగా హెచ్ 1బీ వీసాలు ఓకే అయిన వారు జూన్.. జులైలలో అమెరికాకు వెళతారు. మే మధ్యకు వచ్చేసినా.. ఇప్పటివరకూ అమెరికాకు వచ్చే అంశంపై ఆ దేశం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవటంతో.. తమ ఫ్యూచర్ ఏమిటన్న భయాందోళనలు నెలకొన్నాయి. దేవుడు వరమిచ్చినా.. మాయదారి రోగం మధ్యలో అడుపడిందన్న ఆవేదనను పలువురు హాఫ్ అదృష్టవంతులు వ్యక్తం చేస్తున్నారని చెప్పక తప్పదు.