డబ్ల్యూహెచ్‌ఓ కి 10 శాతం నిధులే ఇస్తారట !
ప్రపంచంలో మహమ్మారి వ్యాప్తికి కారణం చైనానే అని , అయినప్పటికీ కూడా చైనాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుగా నిలుస్తుంది అని గత కొన్ని రోజులుగా అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ ఓ పై మండిపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ వైరస్ సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ ఓ విఫలమైనందున ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్టు ఏప్రిల్ 15న వెల్లడించారు. ఆ సమయంలో చైనా పై , ప్రపంచ ఆరోగ్య సంస్థ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.
ఇక తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందజేసే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి నిధుల్ని కాకుండా పాక్షికంగా అందించేందుకు అంగీకరించినట్టు సమాచారం. అంచనా మొత్తంలో కొంత కోత వేసేందుకు నిర్ణయించిందంటూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. మునుపటి నిధుల మొత్తం సంవత్సరానికి 400 మిలియన్ డాలర్లలో పదోవంతు మాత్రమే చెల్లించనుందని ముసాయిదా పత్రాన్ని ఉటంకిస్తూ తెలిపింది. డబ్ల్యూహెచ్ ఓ కు చైనా ఎంత మొత్తం అయితే చెల్లిస్తుందో అంతే సొమ్ము అమెరికా కూడా చెల్లించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిపింది. అయితే , అమెరికా అధినేత ట్రంప్ ఆరోపణలను డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఆ మహమ్మారి వైరస్ చైనా ల్యాబ్ లో తయారు చేయలేదు అని పదే పదే చెప్పుకొస్తుంది.