గుడ్ న్యూస్: ఏపీలో కరోనా నుంచి కోలుకున్న మరొ బాధితుడు !

Update: 2020-03-30 05:45 GMT
ఏపీని కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 21 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. మరికొంతమంది అనిమానితుల్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై పూర్తి నిఘా పెట్టారు. 14 రోజుల పాటూ వారి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అలాగే జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తన్నారు. ఇకపోతే ఈ మద్యే ఏపీలో తోలి కరోనా పేషేంట్ కి కరోనా నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అతని తరువాత తాజాగా మరొకరు కరోనా నుండి కోలుకున్నారు.

విశాఖలో మూడవ కరోనా పేషెంట్ కరోనా వ్యాధి నుండి  కోలుకున్నాడు. ఇది ఏపీ ప్రజానీకానికి ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.  విశాఖలో అత్యధికంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో మొదటి కరోనా రోగికి వ్యాధి నయమైంది. శనివారం, ఆదివారం చేసిన టెస్టుల్లో కరోనా నెగటివ్‌గా తేలిందని డాక్టర్లు తెలిపారు. ఇక పూర్తి నిర్ధారణ కోసం రోగి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌ కు పంపించారు.

అక్కడ కూడా కరోనా వైరస్ నెగటివ్ తేలితే అతడ్ని డిశ్చార్జ్ చేసి 14 రోజులు హోం క్వారంటైన్‌ లో ఉంచనున్నారు. ఇక ఇప్పటికే డిశ్చార్జ్ అయిన నెల్లూరు యువకుడు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇక ఈ విశాఖ వాసితో ఏపీలో ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నట్లు లెక్క. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 616 మంది శాంపిల్స్‌ను టెస్టులకు పంపించారు. అందులో 495 మంది నెగటివ్ అని తేలగా.. 100 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి.

ఇకపోతే , ఈ కరోనా కారణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా  ..722,350 మందికి కరోనా పాజిటివ్ రాగా ..33 వేల మంది మృతిచెందారు. ఇక భారత్ లో ఇప్పటివరకు 1024 మందికి కరోనా సోకింది. అలాగే ఈ కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 27 మంది చనిపోయారు. లాక్ డౌన్ చేయడం వల్ల కరోనా ని కొంతమేర అడ్డుకోగలిగాం అని చెప్పవచ్చు.ఏదేమైనప్పటికీ కూడా ఈ కరోనా భయంకరమైన మహమ్మారి కాబట్టి ..పూర్తిగా నాశనం అయ్యేవరకు ప్రభుత్వం చెప్పినట్టు విని , వారు చెప్పిన సూచనలు , సలహాలు పాటించండి.
Tags:    

Similar News