చైనాలో కరోనా ఎలా పుట్టిందో సీక్రెట్ తెలిసింది

Update: 2020-04-01 22:30 GMT
కరోనా వైరస్. ఇప్పుడు దీనివల్లే ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లింది. లక్షలమందికి సోకి వేలమంది చనిపోతున్నారు. మరణ మృదంగం వినిపిస్తున్న ఈ వైరస్ చైనాలోని వూహాన్ లో పుట్టింది. ఇప్పుడు దానికి పుట్టుకకు కారణం.. ఎలా పుట్టిందనే విషయాన్ని ప్రాథమికంగా తేల్చారు పరిశోధకులు.

చైనీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో అడవి జంతువులను ఆహారంగా తీసుకుంటారు. వారి కక్కుర్తే ఇప్పుడు ప్రపంచం పాలిట శాపమైంది. కరోనా వైరస్ పుట్టి ప్రపంచానికే పెనుమప్పుగా మారింది.

చైనాలో అడవి జంతువుల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది. వీటిని సంపన్నులు వేలు పోసి కొని తింటుంటారు. ముఖ్యంగా గబ్బిలం, అలుగుల మాంసం తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చైనీయుల ప్రగాఢ నమ్మకం. వాటికి రెండింటికి చైనాలో ఫుల్ డిమాండ్. సంపన్నులే కొనే పరిస్థితి ఉంది.

ఆ క్రమంలోనే గబ్బిలం మాసం తిన్న వ్యక్తికి కరోనా సోకింది. అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తోంది. చైనీయులకు అడవి జంతువుల మాంసం అంటే పిచ్చి. వాటిని తినడానికి ఎగబడుతుంటారు. గబ్బిలాలు, పాములు, పునుగు పిల్లులు, పందులు, అలుగులు, కుక్కలు, పిల్లులు కూడా తింటుంటారు. వారీ ఏహ్యమైన ఆహారపు అలవాట్ల వల్లే కరోనా పుట్టి ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News