ఇది గొప్పగా చెప్పాల్సిన రికార్డు కాదు.. కరోనా కేసుల్లో భారతదేశం ప్రపంచంలోనే 12వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ దేశాలతో పోటీపడడానికి సిద్దమవుతోంది. ఇది మనకు ఆందోళన కలిగించే అంశమే. ఇన్నాళ్లు తక్కువ కేసులని సంబరపడ్డ భారత్.. ఇక ఎంతమంది ఉపేక్షించడానికి వీలులేకుండా ఉంది. చైనా దేశానికి చేరువలోకి వచ్చింది. ఈ వైరస్ కేసులు అత్యధికంగా నమోదైన ప్రపంచ దేశాల్లో చైనా 11వ స్థానంలో ఉండగా.. కెనడాను అధిగమించి భారత్ 12వ స్థానానికి చేరుకుంది.
చైనాలో కేసుల సంఖ్య 82900 దాటగా.. మంగళవారం నాటికి భారత్ లో కరోనా కేసుల సంఖ్య 70756కి చేరింది. ముందు రోజుతో పోలిస్తే 3604(5.06శాతం) కొత్త కేసులు పెరిగాయి. 87మంది మరణించారు. మరణాల శాతం 3.94శాతంగా ఉంది.
భారత దేశంలో కరోనా కేసులు మే 5 నుంచి వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో రోజుకు సగటున 3490 చొప్పున 27920 కేసులు వచ్చాయి.
చైనాలో మరణాల రేటు 5.58శాతం ఉండగా.. భారత్ లో ఇది కేవలం 3.24శాతంగా ఉంది. అయితే రికవరీ రేటు మాత్రం చైనాలో ఏకంగా 94.27శాతంగా ఉండడం విశేషం.