వారంతా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి గోవా ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే ముంబయి నుంచి గోవాకు నౌకాయానం చేశారు. దాదాపు 2000మంది ముంబయి పోర్టు నుంచి గోవాకు కార్డెలియా క్రూయిజ్ షిప్పులో చేరుకున్నారు. కొత్త సంవత్సరాన్ని భాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఈ టూర్ వారికి చేదు అనుభవంగానే మిగిలింది. తిరిగి ఇంటికి వెళ్ధామనుకునేలోపే ఆ షిప్పులో కరోనా కలకలం రేగింది. కొందరిలో కొవిడ్ లక్షణాలు ఉండగా పరీక్షలు నిర్వహించారు. వారిలో 66మందిలో వైరస్ ను గుర్తించినట్లు గోవా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మిగతావారికి వైద్య పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఆ నౌకను గోవా తీరంలో నిలిపివేసినట్లు ప్రకటించింది.
ప్రయాణికులకు కరోనా సోకిన విషయాన్ని అటు ముంబయి పోర్టు, ఇటు నౌక యాజమాన్యానికి తెలియజేశామని గోవా అధికారులు వెల్లడించారు. అయితే బాధితులు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇకపోతే మిగిలిన వారికి పరీక్షల నిర్వహించిన అనంతరం వారిని పంపిస్తామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అందులో ప్రయాణికులు మాత్రం ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా? అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. న్యూఇయర్ వేడుకల కోసం వచ్చిన ప్రయాణికులంతా... కరోనా మహమ్మారి వల్ల సంద్రంతీరంలోనే నౌకలో చిక్కుకుపోయారు.
ఇకపోతే దేశంలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 37వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. డిసెంబర్ రెండో వారం నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది మార్చి-ఏప్రిల్ లో విరుచుకు పడిన మహమ్మారి... కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ గత నెల నుంచి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ తో పాటు కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో ఈ రేటు అధికంగా ఉంది.పర్యాటక ప్రాంతాల్లో కూడా కేసులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకల ప్రభావంతో గోవాలో కేసులు సంఖ్య ఎక్కువైందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
వైరస్ కేసులు మూడు, నాలుగు రోజుల నుంచి భారీగా నమోదవుతున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరగడం థర్డ్ వేవ్ కు సాక్ష్యాలని వైద్యారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో దశ ప్రారంభంలో ఉన్నామని... త్వరలో వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇకపోతే పిల్లల వ్యాక్సినేషన్ పై వస్తున్న అపోహలను ఆయన ఖండించారు. టీనేజర్లకు ఇచ్చే టీకా సురక్షితమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏడాది పాటు మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేశారు.