చైనాలోని వూహాన్ మహానగరంలో పుట్టిన కొవిడ్ వైరస్ పిశాచి.. స్వల్ప వ్యవధిలోనే డ్రాగన్ దేశాన్ని దడదడలాడేలా చేయటం.. వేలాది ప్రాణాల్ని తీయటం తెలిసిందే. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే చైనా లాంటి దేశంలో కొవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించటంలో ఆ దేశం కిందామీదా పడుతోంది. కేవలం వారం కంటే తక్కువ వ్యవధిలో వెయ్యి పడకల ఆసుపత్రిని సిద్ధం చేసి ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చాటి చెప్పారు. అలాంటి పని మరే దేశంలోనూ సాధ్యం కాదని చెప్పాలి.
కొవిడ్ పిశాచి మీద యుద్ధ ప్రాతిపదికన వార్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా దాన్ని కంట్రోల్ చేయటం సాధ్యం కావట్లేదు. ఇప్పటికి నిత్యం పలువురు కొవిడ్ కారణంగా మరణిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో 2900 మంది మరణించినట్లుగా అధికారిక సమాచారం. అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నా.. దాని ఆధారాలుబయటకు రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. చైనా తర్వాత అత్యధికంగా కొవిడ్ వైరస్ మరణాలు బుల్లి దేశమైన ఇరాన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఆ దేశంలో 66 మంది కొవిడ్ కారణంగా మరణించారని.. మరో 1500 మందికి వ్యాధి నిర్థారణ అయినట్లుగా ఇరాన్ ప్రకటించటం తో ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనా తర్వాత కొవిడ్ వైరస్ తీవ్రత ఇరాన్ లోనే ఎక్కువగా ఉందంటున్నారు. సోమవారం ఒక్కరోజులోనే కొవిడ్ కారణంగా చైనాలో మరణించిన వారు 42 మందిగా చెబుతున్నారు. మరో 80వేల మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అంతో ఇంతో సానుకూలాంశం ఏమంటే.. జనవరితో పోలిస్తే.. ఇప్పుడు కొవిడ్ వైరస్ తో బయట పడుతున్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.
చైనా తర్వాత కొవిడ్ వైరస్ మరణాలు ఇరాన్ లో ఎక్కువగా చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు 71 ఏళ్ల మిర్ మొహమ్మదీ తో పాటు మరో 66 మంది కొవిడ్ కారణంగా మరణించారు.కొవిడ్ నియంత్రణ కోసం చైనా అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా ఆ దేశంలో కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టినట్లుగా నాసాతో పాటు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు వెల్లడించాయి. మొత్తంగా కొవిడ్ విశ్వరూపం చైనా తర్వాత ఇరాన్ లోనే అన్నదిప్పుడు మిగిలిన దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.