కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలలో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా..7500 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ప్రస్తుతం 80894 మందికి కరోనా వైరస్ ఉండగా, ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 3237 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ తన విశ్వ రూపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో అంతా అలర్ట్ అవుతున్నారు. ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్ అవుతున్నారు.
ఇక చైనా తరువాత ఈ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఇటలీలో నమోదైయ్యాయి. ఇప్పటి వరకు 31,510 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వేల 530 కేసులు నమోదవ్వడం ఇటలీని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో... 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. ఇక ఇటలీ తరువాత ఇరాన్ , స్పెయిన్ , ఫ్రాన్స్ లో ఈ కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇక కరోనాతో ఫ్రాన్స్‌లో 148 మంది మృతి చెందారు. దీంతో 15 రోజుల పాటు దేశమంతా ప్రభుత్వం లాకౌట్ ప్రకటించింది.
15రోజుల పాటు దేశమంతా లాకౌట్ ప్రకటించిన సర్కారు ఎవ్వరూ ఇళ్లను విడిచి బయటకు రావొద్దని కఠిన ఆంక్షలు పెట్టింది. ఒకవేళ బయటకొస్తే ..దానికి తగ్గ సరైన కారణం తెలపాలి అని , దాన్ని అధికారులు విశ్వసిస్తేనే బయటకి వెళ్ళడానికి అనుమతి. సరైన కారణం లేకుండా బయటకి వస్తే రూ.11,000 జరిమానా కట్టాలి అని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ఎవరూ రోడ్లపైకి రాకుండా లక్ష మంది పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. అలాగే మరోవైపు ఆర్థిక మాంద్యం సందర్భంగా కంపెనీలన్నింటినీ జాతీయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.