ఇట‌లీ సాహ‌సోపేత నిర్ణ‌యం: ద‌శ‌ల‌వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత‌

Update: 2020-04-29 01:30 GMT
క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఇప్పుడు అమెరికాలో తీవ్రంగా ఉండ‌గా.. అమెరికాకు ముందు ఇట‌లీలో క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింది. ఆ దేశంలో క‌రోనా క‌ల్లోలం సృష్టించింది. గ‌తనెలలో ఒక్క రోజులో వేల సంఖ్య‌లో కేసులు, 800 మ‌ర‌ణాలు సంభ‌వించేవి. దీంతో అక్క‌డ ప‌రిస్థితులు అదుపు దాటుతున్నాయ‌ని అంద‌రూ భావించారు. ఇట‌లీలో ఇప్ప‌టి దాకా 2 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డ‌గా.. 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. ప్ర‌స్తుతం ఆ దేశంలో రోజుకు 30-40 కేసులు, ఒక‌టీ రెండు మ‌‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశంలో క‌రోనా కంట్రోల్‌లోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అక్క‌డ ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆ దేశం ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్ ఎత్తి వేస్తోంది. లాక్‌డౌన్ ద‌శ‌ల‌ వారీగా ఎత్తేయ‌డానికి ఇట‌లీ స‌న్నాహాలు మొద‌లు పెట్టింది.

వాస్త‌వంగా ఇట‌లీలో మే 3వ తేదీ వ‌ర‌కు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. క‌రోనా నియంత్ర‌ణ‌లోకి రావ‌డంతో లాక్‌డౌన్ గ‌డువు ముగిసిన వెంట‌నే ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్ స‌డ‌లించ‌డానికి నిర్ణ‌యించారు. మే 4వ తేదీన త‌ర్వాత ప్రాధాన్య క్ర‌మంలో స‌డ‌లింపులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. వాటిలో భాగంగా నిర్మాణ‌, ఉత్ప‌త్తి రంగాల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపునిచ్చారు.

మిన‌హాయింపులు ఇలా..
మే 18వ తేదీన రిటైల్ షాపులు, మ్యూజియం, గ్రంథాల‌యాలు, క్రీడా సంబంధిత కార్య‌క‌లాపాలు ఆరంభించే యోచ‌న‌లో ఉన్నాయి.
జూన్ 1వ తేదీన రెస్టారెంట్లు, కేఫ్‌లు, హేర్-బ్యూటీ సెలూన్లు ప్రారంభం.
అక్టోబ‌ర్‌లో పాఠ‌శాల‌లు, కళాశాల‌లు తెర‌వాల‌ని నిర్ణ‌యం.
డిసెంబ‌ర్‌లో థియేట‌ర్లు, మాల్స్ తెరుచుకునే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News