కరోనా వైరస్ దేశంలో ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో ..మరోసారి లాక్ డౌన్ రెండు వారాలపాటు పొడగించిన సంగతి తెలిసింది. కార్పణ పాజిటివ్ కేసుల నమోదు ఆధారంగా దేశం మొత్తాన్ని మూడు జోన్ లుగా విభజించి, ఆంక్షలతో కూడిన కార్యకలాపాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా.. 10లోపు కేసులు ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్, పెద్ద సంఖ్యలో కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వనున్నారు.
అయితే , గ్రీన్ జోన్ గా ఉన్న కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లాలో వారం రోజుల క్రితం కంటెయిన్ మెంట్ సమయం ముగియడం, అలాగే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఈ జిల్లాను గ్రీన్ జోన్ గా ప్రకటించారు. అయితే , ఒక్క సారిగా 21 కరోనా పాజిటివ్ కేసులు బయట పడటంతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కొందరిలో కరోనా లక్షణాలు ఉన్నాయని భావించి ..మొత్తం 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని పరీక్షలకు పంపారు. వీరిలో 21 మందికి వైరస్ ఉన్నట్టు తేలడంతో, అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. అయితే , వీరికి ఎవరి నుండి కరోనా సోకిందో తెలియడంలేదు. దీనితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఈ జిల్లాలో 10 పాజిటివ్ కేసులు రాగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆపై కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్ గా ప్రకటించారు. తాజాగా 21 కేసుల నమోదు కావడంతో తిరిగి జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
కాగా, కర్ణాటకలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 614కి చేరుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 293 మంది కోలుకోగా.. మరో 327 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వాలని చూస్తున్న నేపథ్యం లో ఏకంగా గ్రీన్ జోన్ లో ఉన్న జిల్లాలో 21 కేసులు నిర్దారణ కావడంతో ప్రభుత్వం ఆలోచన లో పడింది.