దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో 73 మంది కొవిడ్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే కేరళలలో మాత్రం కరోనా వైరస్ సోకిన వ్యక్తి కలకలం రేపాడు. ఆయనకు కరోనా సోకిన విషయం తెలియకపోవడంతో ప్రజల్లో తిరిగాడు. దీన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కేరళలోని త్రిశూర్ జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వ్యక్తి తమ మధ్య తిరిగాడేమోననే అనుమానంతో తమకు కరోనా వ్యాపిస్తుందని ఆందోళన చెందుతూ ఆస్పత్రుల బాట పడుతున్నారు.
కరోనా సోకిన వ్యక్తి దాదాపు వెయ్యి మందిని కలిసినట్లు తెలిసింది. ఇప్పటివరకు వంద మందికి వైద్య పరీక్షలు చేశారు. వారిలో ఇద్దరు పంచాయతీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే కరోనా సోకిన వ్యక్తి త్రిశూర్ లో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యాడని, దాంతో పాటు షాపింగ్ మాల్స్, థియేటర్ కు వెళ్లాడని కేరళ ప్రభుత్వం గుర్తించింది. అయితే అతడికి ఇటీవల నుంచి వచ్చిన వారి వలన సోకిందని తేలింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన కుటుంబంలో ఐదుమందికి కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. వారి వెంట తిరిగిన ఈ వ్యక్తికి కరోనా వ్యాపించిందని గుర్తించారు. అయితే తనకు వైరస్ వ్యాపించిందని తెలియకనే అతడు ప్రజల మధ్య తిరిగాడని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైరస్ వ్యాపించిన అలాగే తిరగడంతో అతడు తిరిగిన ప్రాంతాలను ప్రభుత్వ అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. ఆటోలో తిరిగాడని తేలింది. పోలీసులు అతడి కదిలికలను గమనిస్తున్నారు. ఆయన పర్యటించిన ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అతడితో కలిసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అలా వంద మందికి వైద్య పరీక్షలు చేశారంట. మరికొందరిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేపట్టింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఓ చట్టాన్ని ప్రయోగించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897లోని సెక్షన్ 2ను ప్రయోగించాలని ఆరోగ్య శాఖ సూచించింది. కొవిడ్పై పోరాడేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని ప్రయోగించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి చైర్మన్గా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ)ని ఏర్పాటు చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.