ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎంతటి కర్కోటకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో.. శిక్షలు మరెంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. చిన్న తప్పులకు సైతం భారీ శిక్షల్ని అనుభవించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి పని చేసిన ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 (కరోనా) వైరస్ తమ దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఉండటానికి వీలుగా చైనాతో తమకున్న సరిహద్దు ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు కిమ్.
చైనా నుంచి వచ్చిన వారితో మాట్లాడినా.. చైనా నుంచి వచ్చిన వారిని కలిసినా అరెస్టు చేస్తామన్న ఉత్తర్వుల్ని జారీ చేశారు. చైనా నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణ పేరుతో వేరుగా ఉంచుతున్నారు. వారిని బయటకు రానివ్వటం లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల చైనా నుంచి దేశానికి వచ్చిన వాణిజ్య అధికారి సదరు క్యాంప్ నుంచి బయటకు వచ్చి.. ప్రజా స్నానాల గది వద్ద కనిపించారు.
నిబందనలకు విరుద్ధం గా వ్యవహరించిన సదరు వాణిజ్య అధికారిని భద్రతా సిబ్బంది గుర్తించింది. అంతే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడ్ని కాల్చి చంపారు.కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందటానికి వీల్లేని రీతిలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. వాటిని భిన్నంగా వ్యవహరించిన వారికి తీవ్రమైన శిక్షల్ని అప్పటికప్పుడు అమలు చేస్తున్నారు. చైనాకు వెళ్లే ప్రయత్నం చేసిన మరో అధికారికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కిమ్ రాజ్యమా.. మజాకానా?