కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను విధించారు. ఈ లాక్ డౌన్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా ..ఎప్పుడు మద్యం షాపులు తెరుస్తారు అని మందుబాబులు ఆతృతగా ఎదురుస్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ దందా జోరుగానే సాగుతోంది.. సామాన్యుల కొనలేని రేట్లకు బ్లాక్ మార్కెట్‌లో లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయట.. దీంతో.. కొంతమంది కల్లు తాగి సేదు తీరుతున్నారు.
చాలా మందికి ఇప్పుడు లాక్ డౌన్ లో మద్యం దొరకక పిచ్చి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చేశారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ మందు ఒసం చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. దాని అవసరం ఉన్న వాళ్ళు ఏదోక మార్గంలో దాన్ని తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. తాజాగా రోగులను తరలించే అంబులెన్స్ లో కూడా కల్లు తరలించడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఓ ప్రైవేటు అంబులెన్స్ లో కల్లు తరలిస్తున్న ఇద్దరిని ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ చెకింగ్స్‌లో భాగంగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. అటుగా వచ్చిన అంబులెన్స్‌ను ఆపి తనిఖీ చేశారు.. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా 40 లీటర్ల కల్లును తరలిస్తున్న ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. ఇక, వాళ్లు చెప్పిన సమాధానంతో పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది.. ఎందుకంటే.. ఏకంగా చౌటుప్పల్ నుంచి అంబులెన్స్ లో ఈ కల్లును అమీర్‌పేట్ డివిజన్‌లోని బాపునగర్‌కు తరలిస్తున్నారు. 40 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు.. బాలకృష్న, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు.