కరోనా భయంతో బెజవాడ ప్రభుత్వాసుపత్రి లో చేరిన వ్యక్తి ...

Update: 2020-03-05 08:00 GMT
కరోనా వైరస్ ..చైనాని ఒక ఊపు , ఊపేసిన ఈ మహమ్మారి, ప్రస్తుతం ఇండియాలో వేగంగా విస్తరిస్తూ , దేశ ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తుంది. భారత్ లో కరోనా అనుమానిత కేసులు గత రెండు రోజుల నుండి ఎక్కువుగా నమోదు అవుతున్న నేపథ్యంలో ..ఈ వైరస్ ఏపీని కూడా షేక్ చేస్తుంది. తాజాగా విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఇతను విజయవాడ వాసి అయినప్పటికీ , హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఇక ఈ మద్యే ఉద్యోగ నిమిత్తం జర్మనీ వెళ్లి అక్కడ 15 రోజులు ఉన్నానని , ఆ తర్వాత బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి విజయవాడ వచ్చానని , అప్పటినుండి ఒకటే జలుబు తో చాలా బాధ పడుతున్నాను. దీనితో తనకు కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో హాస్పిటల్ కి వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

అయితే , అతడిలో కరోనా వైరస్ లక్షణాలు లేవు అని వైద్యులు తెలిపారు. అతనికి వచ్చిన జలుబు సాధారణ జలుబే అని నిర్దారించినప్పటికీ , కరోనా ఉందా , లేదా అని నిర్దారించుకోవడానికి, లక్ష్మారెడ్డి శాంపుల్స్‌ ను పరీక్షల నిమిత్తం హైదరాబాదుకు, పుణెకు పంపిస్తు న్నట్లు వైద్యులు తెలిపారు. అంతవరకు లక్ష్మారెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసి ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో పాటుగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కరోనా లక్షణాలతో ఆ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒకరిద్దరు చికిత్స పొందుతున్నట్లు బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాల్లో వార్తలు వస్తుండటం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కరోనా అనుమానిత కేసులు నమోదు కావడం తో ఆ రెండు జిల్లాల ప్రజలు భయపడుతున్నారు.

దీనితో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కూడా , ఈ కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వైరస్‌ బారి నుంచి తప్పించుకునేందుకు కొంత మంది మాస్కులు ధరించి, అలాగే తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. ఇకపోతే ఇప్పటికే ఢిల్లీ , తెలంగాణలలో కరోనా ఇప్పటికే అలజడి సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ విదేశాల నుండి మన దేశానికీ వచ్చేవారి నుండి వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తుండటంతో ఎవరితో మాట్లాడాలన్నా కూడా భయం తో వణికి పోతున్నారు.
Tags:    

Similar News