కరోనా వైరస్ పై దేశ ప్రధాని రాష్ట్రాల సీఎంలు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికీ జనాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వారి నిర్లక్ష్యం వారి ప్రాణాలకే కాదు.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. తాజాగా ఏపీలో కరోనా వైరస్ సోకిన ఓ వివాహిత (28) చేసిన పనికి రాజమండ్రిలో కరోనా విస్తరించడం అధికారులను షాక్ కు గురిచేసింది.
సదురు వివాహిత ఇటీవలే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కర్నూలు నగరం నుంచి గూడ్స్ రైలు ద్వారా రాజమండ్రికి వచ్చిందని అధికారులు తెలిపారు. కర్నూలులో కరోనా బాగా విస్తరించడంతో మహిళకు కూడా కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతూనే ఆమె విషయాన్ని దాచిపెట్టి కర్నూలుకు వచ్చింది. చుట్టుపక్కల వాళ్లను కలిసింది. జ్వరం తగ్గకపోవడంతో ఆర్ ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. అయినా తగ్గకపోవడం వైద్యులను సంప్రదించగా కరోనా అని తేలింది.
వివాహిత చేసిన నిర్లక్ష్యానికి ఆమెకు కరోనా సోకడమే కాదు.. ఆమె కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి - ఆ కాలనీలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. చికిత్స చేసిన ఆర్ ఎంపీ వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో రాజమండ్రిలో పేట - ఆవ రోడ్డు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి అధికారులు కాలనీ వాళ్లందరికి కరోనా టెస్టులు చేస్తున్నారు. క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
ఇక జ్వరం ఉన్నా నిర్లక్ష్యంగా ప్రవర్తించి అంటించిన మహిళతోపాటు రహస్యంగా వైద్యం చేసిన ఆర్ ఎంపీపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
కాగా ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లాలో 26 కేసులు నమోదు కాగా.. రాజమండ్రిలోనే ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాజమండ్రిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎటునుంచి కరోనా వైరస్ ఎవరి ద్వారా వస్తుందోనని భయపడుతున్నారు.