కరోనా కల్లోలం: నిర్బంధంలో ఇటలీ దేశం

Update: 2020-03-10 23:30 GMT
కరోనా కల్లోలం ఇతర దేశాలకు వ్యాపించింది. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. ఏకంగా 100కు పైగా దేశాల్లో కరోనా కేసులు వెలుగుచూడడంతో అందరూ వణికిపోతున్నారు.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరనా బాధితులు, మరణాల లెక్కను తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 3800మంది మరణించినట్టు వెల్లడించింది. లక్షలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొంది.

ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ పై జాగ్రత్తగా వ్యవహరిస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

చైనా తర్వాత ప్రస్తుతం అత్యంత ప్రభావం పడిన దేశాలు ఇటలీ, ఇరాన్ లు. ఇటలీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలను నిర్భంధంలో వెళ్లాలని సూచించింది. కరోనా తగ్గే వరకూ ఎవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది.

ఇక వేళ ఇటలీలో ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ప్రభుత్వం ఆదేశానుసారం.. 6 కోట్ల మంది ఇటలీ వాసులు స్వచ్ఛందంగా గృహ నిర్బంధం లో ఉండిపోయారు. ఇటలీలో ఇప్పటికే 9712 కరోనా కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 463కు పెరిగింది.
Tags:    

Similar News