దేశంలో కరోనా వైరస్ కొత్త రికార్డ్ .. కొత్తగా ఎన్నంటే ?

Update: 2020-09-13 06:45 GMT
భారత్ ‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ  కొనసాగుతూనే ఉంది..గత నాలుగైదు రోజులుగా ప్రతిరోజువారీగా 90వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే, వెయ్యికి పైగా మరణాలు ప్రతిరోజూ నమోదు అవుతున్నాయి. ఇక  కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 94,372 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే, 1,114 మంది మృతిచెందారు. దీంతో భారత్ ‌లో కరోనా మృతుల సంఖ్య 78,586కు పెరగగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,54,356 కి చేరింది.

ఇక, 24 గంటల్లో 78,399 మంది రికవరీ కాగా, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 37,2595కు పెరిగింది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 9,73,175గా ఉన్నాయి.  మరోవైపు, శనివారం ఒకేరోజు 10.71 లక్షల మందికి టెస్ట్ ‌లు నిర్వహించారు. దీంతో ఇప్పటి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5.62 కోట్లకు చేరినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

ఇక , తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 157096కి చేరింది. అలాగే ఒక్క రోజులో 11 మంది కరోనా వల్ల చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 961కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. దేశంలో అది 1.65 శాతంగా ఉంది.  గత 24 గంటల్లో 56217 శాంపిల్ టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 2134912కి చేరింది.

ఇక , ఆంధ్రప్రదేశ్ ‌లో గడిచిన 24 గంటల్లో 9901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 557587కి పెరిగింది. అలాగే, 24 గంటల వ్యవధిలో 67 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4846కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 95733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో ఏపీలో 75,465 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం 45,27,593 కరోనా శాంపిల్స్ టెస్టు చేశారు.
Tags:    

Similar News