ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజుల్లోనే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో చనిపోవడం విషాదం నింపింది. దీంతో ఉద్యోగుల్లో కరోనా ఆందోళన పీక్స్ స్టేజ్ కు చేరింది.
ఇవాళ ఉదయం మరో ఉద్యోగి ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రవికాంత్ ఇవాళ ఉదయం చనిపోయాడు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సచివాలయానికి రావాలంటేనే ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ముగ్గురు ఉద్యోగులు సచివాలయంలో చనిపోవడంతో మిగతా ఉద్యోగులంతా భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఇక కరోనా కల్లోలం దృష్ట్యా ఏపీ ఉద్యోగులంతా తమకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని లేదంటే తాము పనిచేయలేమని డిమాండ్ చేస్తున్నారు.