చావో బతుకో.. ఇక కరోనాతో సమరమే..!

Update: 2020-05-12 04:30 GMT
ప్రధాని మోడీ చెప్పాడని దేశమంతో ఓ ఫైన్ ఆదివారం జనతా కర్ఫ్యూ విధించుకుంది. కరోనా ఉపద్రవం వచ్చిందని ఆ రెండు రోజులకే దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఒకటి .. రెండు.. మూడు లాక్ డౌన్ లు అయిపోయాయి.. 50 రోజులకుపైగానే లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ ఏమున్నది గర్వకారణం.. అంతా కరోనా మయమే.. లాక్ డౌన్ ఇంత స్టిక్ట్ గా ఉన్నా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అస్సలు కంట్రోల్ కావడం లేదు. ఇలా తగ్గి అలా పెరుగుతూనే ఉంది. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయడం?

ఏపీ - తెలంగాణ సీఎంలు అన్నట్టు ఇక కరోనాతో కలిసి బతకడమే పరిష్కారమా అన్న చర్చ మొదలైంది.. ఇప్పటికే ఏపీలో అన్ని దుకాణాలు - వ్యాపారాలు.. సర్వం ఓపెన్ అయ్యి పనులు మొదలైపోయాయి. లాక్ డౌన్ సడలింపులు కేంద్రం రాష్ట్రాలు ఇవ్వడంతో ఇప్పటికే సందడి మొదలైంది. ఇక హైదరాబాద్ రోడ్లపై జనాలు కిక్కిరిసిపోతున్నారు. తెలంగాణ పల్లెలు - పట్నాల్లో షాపులన్నీ తెరిచారు. జనం మామూలు స్థితిలోకి వచ్చేశారు. లాక్ డౌన్ ప్రభావమే లేదు. నేటి నుంచి రైళ్లు.. కొన్ని రాష్ట్రాలు ప్రజారవాణా కూడా మొదలు పెడుతున్నాయి.  కరోనా మరింత పెరిగే చాన్స్ ఉన్నా.. ఇక ఎన్నాళ్లన్నీ 130 కోట్ల మందిని ఇంట్లోనే బంధిస్తాం.. అది జరగని పని.. అందుకే కేంద్రం కూడా 17 తర్వాత సడలింపులు భారీగా ఇవ్వబోతోంది. కరోనాతో సమరమే చేయబోతోంది.

కరోనాతో కలిసి జీవించడం.. కొట్లాడడం తప్ప మనకు మరో మార్గం లేని పరిస్థితి ఈ మూడు లాక్ డౌన్ల తర్వాత ఏర్పడింది. లాక్ డౌన్ ఎత్తివేస్తే చావులు పెరగవచ్చు. కేసుల సంఖ్య భారీగా నమోదు కావచ్చు. కానీ మన ఇమ్యూనిటీ - ఉష్ణోగ్రత - చర్యలతో ఇతర దేశాలతో పోల్చితే అంత తీవ్రంగా ఇక్కడ కరోనా ప్రభావం దేశంలో కనిపించడం లేదు. అదే కాస్త పెద్ద ఊరట.. పల్లెల్లో ఇప్పటికే లాక్ డౌన్ అనే పదమే లేదు. ఇప్పుడు పట్నాలు కూడా లాక్ డౌన్ నుంచి విముక్తి పొందుతున్నాయి.

ఇప్పటికే ఉద్యోగ - ఉపాధి పోయి పేదలు - కూలీలు - మధ్యతరగతి వారికి ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఇక ఎన్నాళ్లో ఇంట్లో ఉండడం కుదరదు. అందుకే జనాలు రోడ్డెక్కుతున్నారు. ఇక లాక్ డౌన్ విధించినా పాటించేంత ఓపిక ప్రజల్లో లేకుండా పోయింది. కరోనాతో తేల్చుకుందామనే అందరూ డిసైడ్ అయ్యారు.

తెలంగాణ సర్కార్ ఎప్పుడో డిసైడ్ అయ్యింది. ఎవరికైతే రోగ లక్షణాలు బయటపడుతాయో వారికే ట్రీట్ మెంట్ చేస్తోంది. ప్రైమరీ - సెకండరీ కాంటాక్టులకు టెస్టులు లేవు.. చికిత్సలు లేవు. సో ఇలానే మున్ముందు కూడా ఉండబోతోంది. కరోనాతో తీవ్రంగా ఉన్నవారికే చికిత్సలు.. లేదంటే వదిలేయడమే..

కరోనాతో మనిషి పోరాడడమే మిగిలింది.. దేశంలో అంత తీవ్రంగా లేకపోవడం మనకు ఊరట.. ఎంత పెద్దగా వ్యాపించినా చావుల సంఖ్య స్వల్పమే. ఈ నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే మళ్లీ పనులు మొదలు కావాలి.. దుకాణాలు తెరవాలి.. ప్రజలు బయటకు రావాలి.. కానీ ఇదంతా పకడ్బందీగా జరగాలి. ముఖానికి మాస్కులు - చేతిలో శానిటైజర్లు - 2 గజాల దూరం.. ఇతర కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వీయ రక్షణ తీసుకొని పనులు చేసుకోవడం తప్పితే మరో మార్గం లేదు. సో ఇక మనం కరోనాతో పోరాటమే మిగిలింది.. అంతకుమించి ఇన్ని లాక్ డౌన్ లు పెట్టినా కంట్రోల్ కానీ కరోనాకు భయపడి ఇంకా ఎన్నాళ్లు దాక్కుద్దాం.. అది మామలు జ్వరంగా భావించి ముందడుగు వేయడమే మిగిలింది..


Tags:    

Similar News