ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా పెరుగుతూ పోతోంది.
ఇప్పటివరకు దేశంలో 107 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 12 కొత్త కేసులు పెరిగాయి. కేరళలో ఇప్పటివరకు 22, యూపీలో 11, హర్యాణాలో 14 కేసులు ధ్రువీకరించారు. వీరంతా విదేశీయులేనని కేంద్రం తెలిపింది.
కొచ్చిన ఎయిర్ పోర్టులో ఓ బ్రిటన్ పౌరుడికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. అతడితోపాటు వచ్చిన 19మందిని వైద్యపరీక్షల కోసం తరలించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ బాధితుల్లో 17మంది విదేశీయులు కాగా.. ఇద్దరు మృతి చెందారు. 10 మంది కోలుకున్నారు.
భారత్ లో రెండో దశ మొదలైనట్టు ప్రకటించిన కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి. శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచాయి.