రోజుకో లక్ష చొప్పున కరోనా కేసులుపెరిగేలా ఉన్నాయి..జాగ్రత్త!

Update: 2020-03-27 06:00 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ దాటికి ప్రపంచంలోని దాదాపు 300 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఐరోపా - అమెరికాలో ఈ  కరోనా వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ - అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌ ను కట్టడిచేయడానికి  ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు - బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

ఇకపోతే ఈ కరోనా ప్రభావం మన దేశంలో కూడా పెరుగుతుంది.  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 733కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 532,263 మంది కరోనా భారిన పడగా ... 24,090 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 85,594కు చేరగా... మరణాల సంఖ్య  1300కి చేరింది. ప్రస్తుతం కరోనా భాదితులు ఎక్కువగా ఉన్న దేశం కూడా అమెరికానే. కరోనా భాదితుల జాబితాలో అమెరికా చైనాను దాటి మొదటి స్థానంలోకి వెళ్ళింది.

కరోనా పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ - పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ..కరోనా వ్యాప్తి చెందే వేగాన్ని చూస్తుంటే మాత్రం ..అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. మార్చి 6 న కరోనా పాజిటివ్ కేసులు లక్ష కి చేరుకోగా ..ఆ తరువాత పది రోజులకి అంటే మార్చి 17 -18 నాటికీ 2 లక్షల మార్క్ ని టచ్ చేసింది. ఆ తరువాత మార్చి 21 నాటికీ ఆ సంఖ్య 3 లక్షలకి చేరింది. కాగా - 23 - 24 నాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలని దాటిపోయింది. ఇక మార్చి 26 నాటికీ కరోనా కేసుల సంఖ్య ..5 లక్షలను క్రాస్ చేసింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే రెండు మూడు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో లక్ష చొప్పున పెరిగినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.
Tags:    

Similar News