కరోనా 80ఏళ్ల వారికి సోకితే వైద్యం లేదు.. చావే..

Update: 2020-03-17 18:30 GMT
ఇటలీని కమ్మేసిన కరోనా వైరస్ కారణంగా ఆ దేశం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలమందికి ఈ వ్యాధి సోకింది. 2వేలకు పైగా మంది చనిపోయారు. జనాలు అడుగు బయటపెట్టకుండా ఇటలీ ప్రభుత్వం నిర్బంధం, ఆంక్షలు విధించింది. ఇటలీ గోస చూసి చైనా వేల మాస్కులు, మందులను, వైద్య బృందాలను ఇటలీకి పంపించి సేవ చేస్తోంది.

చైనా తర్వాత కరోనా అత్యధికంగా విస్తరించింది ఇటలీలోనే.. అందుకే ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, వైద్య సదుపాయాలు లేక ఆ దేశం చేతులు ఎత్తేస్తోందట.. దీంతో రోగులు వందలాది మంది చని పోతున్నారు.

ఇటలీలో వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు కరోనా సోకితే వారికి వైద్య సేవలు అందించడం లేదట.. వారు కోలుకోవడం కష్టమని.. వాళ్లు చనిపోవాల్సిందేనని వదిలేస్తున్న దుర్భర దైన్యం ఇటలీలో కనిపిస్తోందట..

దీనికారణంగానే ఇటలీలో కరోనా సోకిన వృద్ధుల మరణ మృందంగం కొనసాగుతోంది. ఇటలీ మరణాల్లో వృద్ధులే ఎక్కువగా ఉండడానికి వారికి వైద్య సేవలు అందకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News