ప్రపంచదేశాలను కరోనా వైరస్ హడలెత్తిస్తోందన్న విషయం తెలుసు గానా... ఈ వైరస్ మనిషిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? మనిషిలో ఎన్ని రోజులు ఉంటుంది ? ఏ రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? వైరస్ సోకితే మొదట ఏ లక్షణం బయటకి వస్తుంది?... ఇలా చాలా సందేహాలు మనకున్నవే. కరోనా సోకిందంటే.... మరణమే అని ఓ సారి, లేదు కొన్ని మందులతోనూ ఈ వైరస్ నుంచి మనలను మనం కాపాడుకోవచ్చని మరోసారి చెప్పుకుంటున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే... ఒక్క మందుబిళ్లతో కరోనాను ఎదుర్కోవచ్చని చెప్పేశారు. మొత్తంగా కరోనా వైరస్ మనిషిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయంపై ఇప్పటిదాకా మనకు పెద్దగా అవగాహనే లేదని చెప్పాలి.
అయితే ఈ తరహా సందేహాలకు ప్రముఖ జర్నల్ ‘లాన్సెట్’ తన తాజా నివేదికలో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. చైనాలోని వూహాన్ పల్మనరీ ఆస్పత్రిలో కరోనా బాధితులు 191 మందిని ఎంపిక చేసుకొని మూడు వారాల పాటు వారిని నిశితంగా పరిశీలించి రూపొందించిన నివేదికని ఆ పత్రిక తన తాజా సంచికలో ప్రచురించింది. లాన్సెట్ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన వెంటనే మనిషిలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు కనిపించవు. అయిదు రోజుల తరవాత జ్వరం - గొంతు నొప్పి - జలుబుతో మొదలవుతుంది. ఒక్కోసారి లక్షణాలు బయటపడడానికి 14 రోజులు కూడా పడుతుంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ మన శరీరంపై ప్రభావం చూపించడం ప్రారంభించాక ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు వస్తాయన్న వివరాల్లోకి వెళదాం పదండి.
1 - 3 రోజులు
- కరోనా వైరస్ శరీరంపై ప్రభావం చూపించగానే మొదట జ్వరం వస్తుంది
- గొంతు నొప్పి - దగ్గు - జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయి
- కరోనా బాధితుల్లో లక్షణాలు ఇలా మొదలైన వారు 80 శాతం మంది
4 - 9 రోజులు
- మూడు నుంచి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది. కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
- శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారు 14 శాతం మంది
8 - 15 రోజులు
- ఊపిరితిత్తులకు చేరిన ఇన్ ఫెక్షన్ రక్తంలోకి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ప్రాణాంతకమైన సెప్సిస్( బ్లడ్ ఇన్ ఫెక్షన్) ఒక వారం తర్వాత మొదలవుతుంది. అప్పట్నుంచి రెండు వారాల పాటు బాధితుల్ని కాపాడుకోవడానికి అత్యంత జాగ్రత్త అవసరం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందించాలి.
- బాధితుల్లో ఈ పరిస్థితి వచ్చిన వారు 5 శాతం మంది
3 వారాల తర్వాత
- రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాల చికిత్సతో కరోనాను జయించడం సులభమే. హైపర్ టెన్షన్ వంవి వ్యాధులు ఉండి వయసు మీద పడిన వారు ఈ వైరస్ ను ఎదుర్కోవడం కష్టం.