ప్రపంచానికి పెద్దన్న అమెరికా ఇప్పుడు కంటికి కూడా కనిపించని అతి సూక్ష్మజీవి కరోనాకు వణికిపోతోంది. చైనీస్ వైరస్ గా అభివర్ణిస్తూ.. పొలిటికల్ మైలేజీ మీద ఫోకస్ పెట్టిన ఆయన తీరుతో అమెరికా భారీ మూల్యం చెల్లిస్తుందన్న విమర్శలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. చైనాలో విరుచుకుపడే వేళలో.. కరోనా తమ దేశానికి రాకుండా ఉండేలా చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో ట్రంప్ నిర్లక్ష్యం.. అలసత్వానికి ప్రతిగా అమెరికన్లు ఇప్పుడు అనుభవిస్తున్నారని అంటున్నారు.
చైనాలోని నగరాల్లో ఒకటైన వూహాన్ ఎలా అయితే కరోనా ధాటికి కుదేలు అయ్యిందో.. న్యూయార్క్ మహా నగర పరిస్థితి ఇప్పుడు అలానే ఉందన్న మాట వినిపిస్తోంది. వూహాన్ లో మాదిరి తీవ్ర పరిస్థితులు న్యూయార్క్ లో లేకున్నా.. ప్రమాదం పొంచి ఉందన్నది మాత్రం నిజమని చెబుతున్నారు. ఇప్పటివరకూ అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 43,700కు చేరుకుంటే.. అందులో న్యూయార్క్ నగరంలో పాజిటివ్ కేసులు ఏకంగా ఐదు వేలకు దాటటం గమనార్హం.
అమెరికాలో కరోనా వైరస్ కు న్యూయార్క్ మహా నగరం ఉత్పత్తి కేంద్రంగా మారిందన్న అపవాదును మూటగట్టుకుంటోంది. ఇప్పటివరకూ అమెరికాలో కరోనా కారణంగా 550 మంది మరణిస్తే.. అందులో 139 మంది ఒక్క సోమవారం నాడే మరణించటం గమనార్హం. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ లో కరోనా మరణాల సంఖ్య 157కు చేరుకున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో కరోనా వైరస్ బారిన ఈ మహా నగరం భారీగా ప్రభావితమవుతుందని చెబుతున్నారు. దీని ముప్పు నుంచి తప్పించుకోవటానికి న్యూయార్క్ వాసులు కిందామీదా పడుతున్నారు. పగలు. . రాత్రి అన్న తేడా లేకుండా ఉత్సాహంగా.. నిత్య యవ్వనంగా ఉండే న్యూయార్క్ మహానగరం ఇప్పుడు బోసిపోవటమే కాదు.. భయం గుప్పిట్లో గజగజలాడుతోంది.