లాక్‌ డౌన్‌ తో ఉపాధి కోల్పోయిన వ్యభిచారిణులు

Update: 2020-04-06 22:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచం మూగబోయింది. అన్ని దేశాల్లో లాక్‌ డౌన్‌ విధించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆయా రంగాల్లో ఉన్న వారు ఉపాధి కోల్పోయి ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ విధంగా లాక్‌ డౌన్ పక్కాగా కొనసాగుతుండడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వ్యభిచారిణులు కూడా ఉపాధి కోల్పోయారు. వ్యాపారానికి పేరు పొందిన ఆ దేశాల్లో ఉపాధి కోల్పోయారు. పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నవారు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పడుపు వృత్తి చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్న వ్యభిచారిణులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయారు. సెక్స్ వర్కర్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు.

ఈ వ్యాపారానికి పేరు మోసిన థాయిలాండ్‌ లో ప్రస్తుతం ఆ వ్యాపారం అధికారికంగా ఉన్న ఆ వ్యభిచారం ఇప్పుడు స్తంభించిపోయింది. ఆ వ్యాపారం నిలిచిపోవడంతో వ్యభిచారిణుల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ దేశంలో దాదాపు 3 లక్షల మంది వ్యభిచారిణులు రోడ్డున పడిపోయారు. బ్యాంకాక్ - పట్టయా ప్రాంతాల్లో ఈ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వారి పరిస్థితి దినదినగండంగా ఉంది. కరోనా దెబ్బకు వారు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు వ్యభిచారిణులు ఆ వృత్తి లేకపోవడంతో ఇతర వృత్తిలోకి దిగుతున్నారు. బ్యాంకాక్‌ లో ఉండే సెక్స్ వర్కర్లు బార్లలో టిప్స్ కోసం పని చేస్తున్నారు.

ఆ దేశంలోని రెడ్ లైట్ ఏరియాలు ఇప్పుడు బోసిపోయాయి. దీంతో ఆ వ్యభిచారిణులు నైట్ క్లబ్‌ లు - మసాజ్ పార్లర్‌ లను మూసివేయడంతో ఆ వ్యభిచారిణులు పొట్ట నింపుకోవడానికి ఇతర పనులు చేస్తున్నారు. రోజు గడిచే పరిస్థితి లేని సమయంలో వారు కొత్త కొత్త పనులు చేస్తున్నారు. ప్రస్తుతం థాయిలాండ్‌ లో 2 వేల మందికి వైరస్ సోకగా - 20 మంది మృతిచెందడంతో ఆ దేశంలో పక్కాగా లాక్‌ డౌన్‌ అమలవుతోంది.

Tags:    

Similar News