కాయ‌గూర‌ల క‌న్నా చికెనే త‌క్కువ రేటుకు..!

Update: 2020-03-11 06:25 GMT
ఒక‌వైపు చాలా ర‌కాల కూర‌గాయ‌ల కిలో ధ‌ర ప‌దుల రూపాయ‌ల్లోనే ఉంటోంది. ట‌మోటో త‌ప్ప మిగిలిన కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఇప్పుడు మార్కెట్లో మంచి స్థాయిలో ఉన్నాయి. ఇర‌వై, ముప్పై, న‌ల‌భై, యాభై రూపాయ‌ల ధ‌ర కూడా ప‌లుకుతున్నాయి వివిధ కూర‌గాయ‌లు. అయితే ఒకే ర‌కం కూర‌గాయ‌ల‌తో రోజు వారి వంట అయిపోదు! శాకాహారంలో ఏ క‌ర్రీ చేసుకోవాల‌న్నా.. వివిధ ర‌కాల కూర‌గాయ‌లు ఉండాల్సిందేనాయె! రొటీన్ గా కూర‌గాయ‌లతో వండుకోవాలంటే ఒక‌ స్థాయిలోనే ఖ‌ర్చు పెట్టాల్సిందే!

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తో వండుకోవ‌డం సుల‌భం అయిపోయింది. చికెన్ లోకి ఏ ఉల్లిపాయ‌లో త‌ప్ప ప్ర‌త్యేకంగా మ‌రే కూర‌గాయ‌లూ అవ‌స‌రం లేదాయె. ఇప్పుడు ఏపీలో కిలో చికెన్ 80 రూపాయ‌లు! ఈ మేర‌కు చికెన్ సెంట‌ర్ల ముందు ప‌ల‌క‌లు త‌గిలిస్తున్నారు. కిలో చికెన్ 80 రూపాయ‌లే అని పిలిచి మ‌రీ అమ్ముతున్నారు.

మ‌రి కొంద‌రు ఇంకా త‌క్కువ ధ‌ర‌కే అమ్మ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. హోల్ సేల్ మార్కెట్లో చికెన్ బ‌ర్డ్ కిలో 46 రూపాయ‌లు ప‌లుకుతూ ఉంద‌ట‌. దీంతో లైవ్ చికెన్ ను కిలో ఏ 50కో, 60కో అమ్ముతున్నారు. ఇలా చూస్తే.. కొన్ని ర‌కాల కూర‌గాయ‌లను కిలో లెక్క‌న కొన‌డం క‌న్నా, చికెన్ కిలో కొన‌డానికి త‌క్కువ ధ‌ర చెల్లించాల్సిన ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది.

క‌రోనా భ‌యాల‌తో.. ఇలా చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. కొనే వారు త‌క్కువ కావ‌డంతో త‌క్కువ ధ‌ర‌కు అమ్ముతున్నారు. పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ దీంతో చాలా ఇబ్బందులు ప‌డుతూ ఉంది. కొన్ని చోట్ల అయితే కోళ్ల‌ను పెంచ‌డం ఆపేస్తున్నారట‌. కొన్ని ల‌క్ష‌ల పిల్ల‌ల‌ను స‌మూహికంగా చంపేసి, వాటి పోష‌ణ భారాన్ని త‌గ్గించేసుకుంటున్నార‌ట పౌల్ట్రీ య‌జ‌మానులు!
Tags:    

Similar News