కేరళలో 65 ల‌క్ష‌ల మందికి కరోనా ..?

Update: 2020-03-18 03:45 GMT
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ప్రస్తుతం 80894 మందికి కరోనా వైరస్ ఉంది. అలాగే... ఇప్పటివరకూ చైనాలో 3237 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలలో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా..7500 మంది ప్రాణాలు విడిచారు.చైనా తరువాత కరోనా తో ఎక్కువగా ఇబ్బందిపడుతున్న దేశం ఇటలీ. ఇక భారత్‌ లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో 147 మందికి పైగా కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది.

ఇకపోతే , ఈ కరోనాని నియంత్రించడం లో చైనా కొంచెం సఫలం అయ్యింది అని చెప్పాలి. కాగా , మన దేశంలో కరోనా ని ముందుగా గుర్తించింది కేరళలో. ఆ తరువాత కరోనా భాదితులకు చికిత్స అందించి వారిని కాపాడారు. అయితే ఆ త‌ర్వాత కూడా కేర‌ళ‌ లో కొన్ని కేసుల‌ను గుర్తించారు. కానీ , ప్రస్తుతానికి అయితే , ఇండియా లో కరోనా కొంచెం నియంత్రణలోనే ఉంది. అయితే , వచ్చే రెండు వారాల సమయం చాలా కీలకం కాబోతుంది. ఈ రెండు వారాల పాటుగా కరోనా రాకుండా అడ్డుకోగలిగితే పూర్తిగా నియంత్ర‌ణ సాధించ‌వ‌చ్చు అని వైద్య శాఖ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే క‌రోనా గురించి నేష‌న‌ల్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ కేర‌ళ శాఖ పెద్ద షాకింగ్ విష‌యాన్నే తెలిపింది.

జాతీయ ఆరోగ్య సంస్థ కేర‌ళ శాఖ అంచ‌నా ప్ర‌కారం..ఒక్క కేర‌ళ‌లోనే రానున్న రోజుల్లో ఏకంగా 65 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకే అవ‌కాశం ఉందట, అంత మందికి క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌ని కేర‌ళ శాఖ ఆ రాష్ట్ర హై కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో పేర్కొంద‌ట‌. క‌రోనా తీవ్ర‌త అత్య‌ధికంగా ఉండిన చైనాలో కూడా అంత‌మందికి ఆ వైర‌స్ సోక‌లేదు. అయితే జాతీయ ఆరోగ్య శాఖ కేర‌ళ విభాగం మాత్రం ఈ విధంగా తెలిపింది. 65 ల‌క్ష‌ల మందికి కరోనా అంటే.. కేర‌ళ జ‌నాభాలో దాదాపు 19 శాతం. అసలు ఈ లెక్క దేని ఆధారంగా తెలిపింది అంటే ..ఈ మద్యే ఒక షిప్ లో దాదాపు 3700 మంది ప్ర‌యాణిస్తుంటే, వారిలో ఏకంగా 700 మందికి క‌రోనా సోకింది. అంటే దాదాపు షిప్ లో ఉన్నవారిలో 19 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ లెక్క‌న కేర‌ళ‌లో కూడా 19 శాతం మందికి క‌రోనా సోకుతుంద‌ని అక్కడి వైద్యాధికారులు అంచ‌నా వేస్తున్నార‌ట‌. అయితే , ఎక్కడో 19 శాతం కరోనా సోకింది అని , కేరళలో కూడా 19 కరోనా సోకవచ్చు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ? కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదే కానీ , కరోనా విజృంభించబోతుంది ...అంత మందికి వస్తుంది..ఇంత మందికి వస్తుంది అని లెక్కలు చెప్పి ప్రజలని భయానికి గురిచేయడం కరెక్ట్ కాదు..


Tags:    

Similar News