ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా.. భారత్‌ను కూడా భయాందోళనల్లో ముంచేస్తోంది. కరోనా వైరస్ భారత్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రాంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిందర్నీ క్వారంటైన్ లో ఉంచారు. ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్న జనం మత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు... సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా వ్యాధిని మరింత వ్యాప్తి చెందిస్తున్నారు.ఇప్పటివరకు మొత్తం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న ఒక్కరోజే ఏకంగా 13 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటినుండి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఈనెల 26వ తేదీన కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతడి కుటుంబ సభ్యులు నలుగురిని గాంధీకి తీసుకెళ్లి పరీక్షలు చేసారు. అయితే, ఆ నలుగురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు మనదేశంలో విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది. తాజాగా వారు సరైన నిబంధనలు పాటించని కారణంగా ఆ మహమ్మారి కాస్త మరొకరికి అంటుకుంటుంది.