లాక్‌డౌన్ తెలంగాణలో పక్కాగా అమలవుతోంది. ప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలు పాటిస్తూనే ప్రజలు తమ అవసరాలు తీర్చుకుంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు లాక్‌డౌన్, కరోనా కట్టడిపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తూ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్, కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే తెలంగాణ ప్రజలు స్వతహాగా మందుతోపాటు భోజనప్రియులు. ముక్క, సుక్క లేనిది తెలంగాణలో దావత్ (విందు)లు జరగవని అందరికీ తెలిసినదే. అది తెలంగాణ సంస్కృతి అనుకోవచ్చు.. ఏదైనా అనుకోవచ్చు. అందుకే మార్చి 29వ తేదీ ఆదివారం మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. లాక్‌డౌన్ అమలై వారమైంది. ఇన్నాళ్లు ఇంట్లో వండిందే తిన్నారు.
సాధారణంగా ఆదివారం ప్రతి ఇంట్లో మాంసాహారం ఉంటుంది. అదే క్రమంలో ఈ ఆదివారం కూడా మాంసం కోసం ప్రజలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలు కిటకిటలాడాయి. ఈ సోయిలో పడి సామాజిక దూరం, శానిటైజర్ వంటి ముచ్చట మరచిపోయారు. అయితే వారికి ముక్క అయితే ఉంది గానీ సుక్క అంటే మందు లేదు. వారం రోజులుగా మందులేక ప్రజలు అల్లాడుతున్నారు. సాధారణంగా రోజుకో బీరు.. లేదా ఓ పెగ్ పుచ్చుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చున్న సమయంలో అరె జర మందు ఉంటే మస్త్ ఉంటుండే అని పేర్కొంటున్నారు. గిట్లాంటి సమయంలో మందు తాగితే ఉంటది మజా అనుకుంటూనే మందు దొరకడం లేదని బాధపడుతున్నారు. నాలుకనేమో మందును కోరుతోంది.. బయట మాత్రం ఎక్కడ మందు లభించడం లేదు. చివరకు చీప్ లిక్కర్ దొరికినా తాగేందుకు సిద్ధమయ్యారు. కానీ దొరకడం లేదు. అయితే బ్లాక్‌లో అక్కడక్కడ దొరుకుతున్నా ధరలు మాత్రం మూడింతలు పెరిగాయి. ఒక్క ఫుల్ బాటిల్ 3 నుంచి 5 వేలకు అమ్ముతున్నారు. అది వేలంపాటలో మాదిరి ఎంత ఎక్కువ ధర చెల్లిస్తే వారికి ఆ మందు లభిస్తోంది. ఆ విధంగా పరిస్థితులు మారిపోయాయి.
అయితే గివన్నీ కాదని ప్రజలు వైన్స్ దుకాణాల వద్ద దొంగతనానికి పాల్పడుతున్నారని సమాచారం. మందు కోసం దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారంట. తమకు సమీపంలో ఉన్న వైన్స్ దుకాణాల వెనక భాగంలో కిటికీలు, అద్దాలు పగలగొట్టి మందు ఎత్తుకెళ్తున్నారని తెలుస్తోంది. మందు కోసం ఆగడం లేదు. బీర్ ఎలాగో దొరకడం లేదు. కనీసం చీప్ లిక్కరయినా లభిస్తుందని గోదాములు, వైన్స్ దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని సమాచారం. దీన్ని గుర్తించిన వైన్స్ యజమానుల సంఘం పోలీసులను ఆశ్రయించింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో మందు దొరక్క ప్రజలు వైన్స్ దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులను వైన్స్ యజమానులు ఫిర్యాదు చేశారు. తమ దుకాణాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేయాలని వైన్స్ డీలర్లు కోరారు. పోలీస్ కమిషనర్‌కు ఈ పరిస్థితి వివరించి డీలర్లు ఆందోళన చెందుతున్నారు. మందుబాబులు పలుచోట్ల షెట్టర్లు పగులగొట్టి, మరికొన్ని చోట్ల అద్దాలు పగులగొట్టి మందును ఎత్తుకెళ్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ విధంగా తెలంగాణ ప్రజలు మందు కోసం తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొందరు మందు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. అందుకే సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో ఒక్క మూడు గంటలు వైన్స్ తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం యూట్యూబ్‌ల్లో లైవ్ వస్తుంటే కింద కామెంట్లన్నీ.. సార్ వైన్స్ తెరవండి.. ఒక్క గంటయినా పర్లేదు.. ప్లీజ్ సార్ అంటూ యువకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌తో మందు లేక ముఖ్యంగా తెలంగాణ యువత బాధపడుతోంది.