హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం నిత్యం జనాలతో కిటకిటలాడుతుంటుంది. లాక్ డౌన్ అమలులో ఉన్నపటికీ కూడా గత రెండు రోజుల ముందు వరకు జనాలతో పాతబస్తీలోని కొన్ని వీధులు కిక్కిరిసిపోయాయి. అయితే , తాజాగా పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా మార్చడంతో జనసంచారం బాగా తగ్గి , నిర్మానుష్యంగా మారాయి.
రెండు రోజుల క్రితం జీహెచ్ ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని 6, 7, 8 సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కంటైన్ మెంట్ క్లస్టర్ లను ఏర్పాటు చేసిన అధికారులు.. శనివారం 9,10 సర్కిళ్లల్లోనూ కొత్తగా కంటైన్ మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్ల వద్ద నోడల్ అధికారులను నియమించారు. ఫోన్ సమాచారం ద్వారా నిత్యావసరాలను అందజేస్తున్నారు. బారికేడ్ల వద్ద ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
మీరాలమండీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తుండడంతో ఇక్కడి వీధులన్నీ మొన్నటి వరకు రద్దీగా కనిపించేవి. కానీ, ఆ దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా చేరుతుండటంతో , పోలీసులు దుకాణదారులని హెచ్చరించారు. తప్పకుండా సామజిక దూరం పాటించాలని చెప్పారు.
ఆలా చేయకపోతే కేసులు పెడతామని హెచ్చరించడంతో వ్యాపారులు మూకుమ్మడిగా తమ దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. పోలీసులు తగిన బందోబస్తు కల్పించి వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటే దుకాణాలను తెరుస్తాం అని మీరాలంమండీ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాజుల అంజయ్య తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు గుర్తించి ఏర్పాటు చేసిన కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో శనివారం కూడా గస్తీ కొనసాగింది. పోలీస్, వైద్య, జీహెచ్ ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలో నిమగ్నమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టగా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో రసాయనాల స్ప్రే చేశారు. వైద్య సిబ్బంది కూడా ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు.