చైనాలో మరణ మృందంగం వినిపిస్తున్న కరోనా వైరస్ దాని చుట్టుపక్కల దేశాలకు పాకింది. దక్షిణ కొరియా, జపాన్ లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల చైనాలో మెడికల్ కిట్ల కొరత, మందులు, సామగ్రి కొరత వాటిల్లడంతో భారత్ చేయూతనందించింది.
భారత వైమానిక దళ విమానం చైనాలోని వూహాన్ కు 15 టన్నుల మందులు, వైద్య సామగ్రిని తాజాగా పంపింది. ఇక ఆ విమానంలో తాజాగా తిరిగి వచ్చేటప్పుడు 112మంది భారతీయులని భారత్ తీసుకొచ్చింది.
రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో దాదాపు 650మంది ఇప్పటికే భారత్ చేరారు. తాజాగా తీసుకొచ్చిన వారిని 14రోజులపాటు వైద్య పరీక్షలు చేసి పరిశీలించిన తర్వాత వారి ఇంటికి పంపిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
మరోవైపు జపాన్ తీరంలో ఆగిపోయిన విలాసవంతమైన డైమండ్ ప్రిన్సెస్ ఓడలో భారతీయులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ ఓడలోని వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రాని వారిని గురువారం భారత్ కు పంపిస్తున్నారు. ఈ మేరకు జపాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 3711మంది ప్రయాణికులు ఆ ఓడలోనే ఉన్నారు. ఇందులో 138మంది భారతీయులున్నారు.