వూహాన్ లోనే కరోనా పుట్టుక.. చైనా ఏమందంటే?

Update: 2020-05-08 10:50 GMT
అమెరికా మరో సంచలన విషయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ వూహాన్ లోని ల్యాబ్ నుంచే విడుదలైందని.. తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాలను తాను స్వయంగా చూశానని బాంబు పేల్చారు.

వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ విడుదలైనట్లు చైనాకు డిసెంబర్ లోనే తెలుసు అని మైక్ పాంపియో అన్నారు. అయినా వారు వేగంగా స్పందించలేదని ఆరోపించారు. దమ్ముంటే తమ ఆరోపణలపై విచారణ చేయాలని చైనాకు సవాల్ చేశారు.

ఇక అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపణలపై చైనా స్పందించింది. వూహాన్ లోని పీ4 వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫ్రాన్స్ దేశం భాగస్వామ్యంతోనే నిర్మించామని తెలిపింది. సిబ్బందికి సైతం ఫ్రాన్స్ శిక్షణ ఇచ్చిందని చైనా పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వైరస్ పుట్టుకపై కట్టుకథలు చెబుతున్నారని.. వూహాన్ ల్యాబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని చైనా తెలిపింది.

ఇక అమెరికాలోని పెర్ల్ హార్బర్ పై 1940వ దశకంలో జపాన్ దాడి కంటే కరోనా వైరస్ దాడి పెద్దదని ట్రంప్ వ్యాఖ్యానించడంపై చైనా మండిపడింది. అమెరికా శత్రువు కరోనా వైరస్ కానీ చైనా కాదని హితవు పలికింది.  వైరస్ తో ముందు పోరాడాలని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. వైరస్ పుట్టుకపై డబ్ల్యూహెచ్.వోకు సహకరిస్తామని చైనా తెలిపింది.
Tags:    

Similar News