ప్రత్యర్థులు ఎవరైనా సరే.. బస్తీ మే సవాల్ అన్నట్లుగా వ్యవహరించే బీజేపీకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. తెలంగాణ అధికారపక్షాన్ని ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండాలని ఎంత ప్రయత్నించినా.. ఎక్కడో.. ఏదో తేడా కొట్టినట్లుగా పెద్దగా వర్క్ వుట్ కాని పరిస్థితి. ఇంతకాలం రాష్ట్ర అధ్యక్ష పదవి హైదరాబాద్ నేతల గుప్పిట్లో నుంచి జిల్లాలకు బదిలీ చేయటం తెలిసిందే. కొత్త మార్పును ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కొత్త చిక్కు వచ్చి పడింది.
ఇటీవల బీజేపీ కార్యాలయంలో కరోనా కేసులు పెరిగిపోవటాన్ని ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసులో ఐదుగురి వరకు కరోనా కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి సైతం పాజిటివ్ గా తేలింది. తాజాగా పార్టీ కార్యాలయంలోని నలభై మందికి పరీక్షలు చేయగా.. ఐదుగురికి కరోనా సోకిన వైనాన్ని తేల్చారు.
దీంతో.. పార్టీ ఆఫీసులో కరోనా నిబంధనల్ని మరింత పక్కాగా చేపట్టాలని భావిస్తున్నారు. రూల్స్ ను ఏ మాత్రం బ్రేక్ చేయకుండా.. తూచా తప్పకుండా అమలు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ కార్యాలయంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు. కరోనా పాజిటివ్ గా తేలిన ఉద్యోగుల్ని క్వారంటైన్ కుతరలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే కరోనా ఆందోళనతో పార్టీ కార్యాలయాన్ని వారం రోజులుగా మూసి ఉంచారు.గతానికి భిన్నంగాపార్టీ కార్యాలయానికి పరిమిత సంఖ్యలో మాత్రమే విజిటర్స్ ను అనుమతిస్తున్నారు. సిబ్బంది విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ తాజాగా మరిన్నిపాజిటివ్ కేసులు నమోదు కావటంపై కొత్త టెన్షన పట్టుకుందని చెబుతున్నారు. కరోనాను ఏ విధంగా అధిగమించాలో అర్థం కాక రాష్ట్ర పార్టీ నాయకత్వం కిందామీదా పడుతుందన్న మాట వినిపిస్తోంది.