విజయవాడ లో లారీ డ్రైవర్ నుంచి 8 మందికి కరోనా..ఎలా అంటే!

Update: 2020-04-25 06:05 GMT
ఏపీలో కరోనా కలకలం రోజురోజుకి పెరిగిపోతుంది. ఏపీలోని కర్నూలు , గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు విజయవాడలో కూడా ఇప్పటికే కరోనా కేసులు 100 దాటిపోయాయి. అయితే, విజయవాడలో కొందరి వల్లే కరోనా వైరస్ ఎక్కుమందికి సోకిందని అధికారులు తేల్చారు. దీనితో ఇప్పుడు వరైనా కొత్తవారిని కలవాలన్న ఇప్పుడు ప్రజల్లో వణుకుపుడుతోంది.. అంతేకాదు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ ‌గా రావడం ఇంకా ఆందోళన కలిగించే విషయం.

ఇకపోతే తాజాగా ఏపీలో ప్రకటించిన కరోనా కేసుల్లో విజయవాడలో నమోదైన కేసులు సగం ఓ లారీ డ్రైవర్ నుంచే వచ్చాయని తేల్చారు అధికారులు. తాజాగా వెల్లడించిన కేసుల్లో విజయవాడ లో నమోదైన 14 కేసుల్లో.. లారీ డ్రైవర్ కాంటాక్ట్ ద్వారా వచ్చినవే 7 కేసులు అని చెబుతున్నారు. ఈ లారీ డ్రైవర్ వల్లే ..కృష్ణలంకలో పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి అని అధికారులు చెప్తున్నారు.

అసలు ఈ లారీ డ్రైవర్ కి కరోనా ఎలా సోకింది అంటే ..విజయవాడ కృష్ణ లంకలో నివాసముంటున్న ఓ లారీ డ్రైవర్ తాజాగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత కోల్ కతా మార్కెట్లకు వెళ్లాడు. అక్కడ లారీ రోడ్ చేసుకుని తిరిగి నగరానికి వచ్చాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ఇతర డ్రైవర్ల తో కలిసి తిరిగాడు. చివరికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి చికిత్స కోసం పంపారు. అప్పటికే అతని కారణంగా 8 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిని వెంటనే ఐసోలేషన్ కి పంపారు. లాక్ డౌన్ నుండి  నిత్యావసరాల రవాణా పేరుతో గూడ్స్ వాహనాలను రోడ్ల పైకి రావడానికి  తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పట్టించుకుకోవడం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే అనుమానాలున్నాయి.
Tags:    

Similar News