కోవిడ్ 19 / కరోనా వైరస్ దేశంలో రానున్న రోజుల్లో లక్షలాది మందికి వ్యాప్తి చెందుతుందా? మే లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆ తరువాత క్రమంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది కనీసం 40 శాతం మంది దేశ జనాభాలో వ్యాధి బారిన పడతారా? అదే జరిగితే వీరిలో ఎంతమంది మరణిస్తారు? ఎందరు క్షేమంగా బతికి బట్టకడతారనేది చెప్పలేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే అందుకు కాలమే సమాధానం చెప్పాలి.
మే 3 తరువాత దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రధాని మోడీ విధించి కరోనా ను అదుపులోకి తెస్తరని ఒవైపు ప్రచారం జరుగుతుంటే మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేస్తారని సూచనలు అందుతున్నాయి. ఢిల్లీ - పంజాబ్ - గుజరాత్ - మహారాష్ట్ర - యుపి - తెలంగాణ - తమిళనాడు తదితర రాష్ట్రలు లాక్ డౌన్ పొడిగింపుకు పట్టుదలతో వున్నప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.
మనుషుల ప్రాణాలతోపాటు వారి జీవన విధానం - ముఖ్యంగా ఉపాధి - ఆర్ధిక రంగాలు కూడా ప్రధానమనే ఒత్తిడి వస్తుండటంతో లాక్ డౌన్ ఎత్తేసే తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నవి.
ఇప్పటి వరకూ ఉన్న లెక్కలన్నీ మే నెలాఖరుకు గానీ జూన్ లోగానీ అసలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రల్లో ఎక్కువ - కొన్ని రాష్ట్రల్లో తక్కువ వుంది. కానీ లాక్డౌన్ తరువాత పరిస్థితి విషమిస్తుందని అంచనా. అపుడు కాస్త అటూఇటూగా దేశమంతా ఒకేలాగ తయారవుతుందని వైద్యులు భయపడుతున్నారు
లాక్ డౌన్ - సరైన వైద్యం అందించడం వల్ల చైనాలోని వ్యూహాన్ లో పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ అక్కడ కొత్త కేసులు రావడం లేదు. మరి అక్కడ ఎలా సక్సెస్ అయ్యారు అంటే ఎవరి వద్ద సరైన సమాధానం లేదు. అధ్యయనం చేశాకే చెప్పగలం అంటున్నారు వైద్యులు - శాస్త్రవేత్తలు. మరో వైపు చైనా వాస్తవాలను ప్రపంచానికి చెప్పకుండా దాచిపెడుతోందనే ఆరోపణలు వున్నాయి.
ప్రపంచదేశాలతో (మొత్తం 185 దేశాలు) పోలిస్తే భారతదేశం అధికంగా వ్యాప్తి చెందుతున్న మొదటి 15 దేశాల్లో వుంది. అతి తక్కువగా వ్యాప్తి చెందుతున్న - అదుపులో వున్న సింగపూర్ - దక్షిణ కొరియా - తైవాన్ - వియత్నాం మొదలైన దేశాల్లో తక్కువగను -- అదుపులోనూ వుంది. అక్కడ లాక్‌డౌన్ లాంటి నియంత్రణలు పాటిస్తున్నారు. అక్కడ, మన దేశంలోని కేరళ రాష్ట్రంలోను అదుపు చేయడానికి అక్కడి ప్రభుత్వాల విధానాలతోపాటు ప్రజా వ్యవస్థలు - వైద్య ఆరోగ్య విధానం తోడ్పడ్డాయి.
ప్రజావైద్యం నామమాత్రం
భారతదేశంలోని అత్యధిక రాష్ట్రల్లో ప్రజావైద్యం నామమాత్రంగానే వుంది. నియోలిబరల్ విధానాలు అమల్లోకి వచ్చాక వైద్యం ప్రయివేటు పరం అయింది. ఈ ప్రయివేటు వైద్యం ధనవంతులకు - లేదా గుండె - మూత్రపిండాలు - కాన్సర్ వంటి ఖరీదైన రోగాలకు చికిత్స చేయడానికే తప్ప (వ్యాపార ధోరణిలో) ప్రజా వైద్యానికి అంటే మూకుమ్మడి అంటువ్యాధులకు (అంటువ్యాధుల చికిత్సల ఆసుప్రతులకు లాభం వుండదు) ఉపయోగపడవు. అందువల్ల రోగులు వారంతట వారే వ్యాధి నిరోధక శక్తి ఎంతో కొంత చికిత్స వల్ల కోలుకో వలసిందే.
40 నుంచి 60 శాతం వరకు ఈ వ్యాధి సంక్రమణకు గురైన క్రమంలో ఈ వ్యాధిని తట్టుకునే శక్తి కొందరిలో సహజంగా ఏర్పడుతుంది. వారు సులభంగా బతికిపోతారు. మళ్లీ మళ్లీ వ్యాప్తి చెందినా అటువంటి వారికి అసింప్టమ్స్ రోగులుగానే జీవనం సాగిస్తారు. ఇదే జరిగితే మళ్లీ వ్యాధి దేశంలో విజృంభించి కనీసం 40 శాతం మంది సంక్రమణకు గురవుతారా?
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందన్నది ఎవరికీ తెలియదు. దీనికి వైద్యులు - శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ అంతమయినా మళ్ళీ రాదన్న గ్యారంటీ కూడా లేదు. అందుకు తాజాగా చైనాలో 15 కేసులు నమోదు కావడమే ఉదాహరణ (వ్యూహాన్ లో కాదు). ఇది ఎవరో అన్నమాటలు కావు.. సాక్ష్యాత్తూ ప్రభుత్వ రంగంలో వుంటూ కోవిడ్ చికిత్సను పర్యవేక్షిస్తూ - సంబంధించిన జాతీయ - అంతర్జాతీయ సంస్థలతో అనునిత్యం సంబంధాలు కలిగిన అత్యున్నత స్థాయి వైద్యులే. వారి మాటల ప్రకారం పరిస్థతిని విశ్లేషిస్తే…
దీనికి వున్న ఒకే ఒక్క శాశ్వత పరిష్కారం వ్యాక్సీన్. అది ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధన దశలోనే వున్నది. అది మానవ పరీక్షలను పూర్తి చేసుకుని అనుమతులన్నీ వచ్చి మన దాకా రావాలంటే కనీసం ఏడాది పైనే పట్టవచ్చు. వ్యాక్సీన్ రూపొందించిన తరువాత ప్రపంచ అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తి చేయడానికి కూడా నెలల సమయం పడుతుంది.
ఇవి తాత్కాలిక చర్యలే
ప్రస్తుతం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు గాని, ఈ లాక్ డౌన్లు గానీ కేవలం కోవిడ్ రోగుల సంఖ్య పెరిగిపోకుండా చూసే చర్యలు మాత్రమే. ఒక్కసారిగా కోవిడ్ రోగులు పెరిగిపోతే మన వద్ద వున్న ఆసుపత్రులుగానీ - వైద్యులు గానీ - ప్రభుత్వ / పర్ జారోగ్య / వైద్య ఆరోగ్య వ్యవస్థ గానీ సరిపోదు. అందుకే కోవిడ్ రోగుల సంఖ్య పెరగకుండా ఉండటం కోసమే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ.
ఇంతవరకు కరోనా వైరస్ వ్యాధికి సరైన చికిత్స లేదు. ఇప్పటిక వరకు కోవిడ్ పాజిటివ్ నుంచి కోలుకుంటున్నవారంతా కేవలం డాక్టర్ల ప్రయత్నానికి వారిలో వున్న రోగనిరోధకశక్తి తోడవడం వల్ల మాత్రమే కోలుకుని డిశ్చార్జి అవుతున్నారు. చనిపోతున్నవారిలో అత్యధికులు వ్యాధి నిరోధక శక్తి తక్కువ వున్నవారే. అలా అని పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత ఏమీ లేదనీ అనలేము.
రోగనిరోధక శక్తి అత్యవసరం
డాక్టర్ల ప్రయత్నాలకు రోగిలో వున్న ఇమ్యూనిటీ సహకరించకపోతే ఆ రోగి బతికే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి కరోనా నుంచి గట్టెక్కడానికి ప్రస్తుతం మనకు అవసరమైనది రోగనిరోధకశక్తి మాత్రమే! ఇంతకంటే కరోనాకు ప్రపంచవ్యాప్తంగా నిర్దిష్టమైన చికిత్స ఎక్కడా లేదు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద గాని - కేంద్ర ప్రభుత్వం వద్ద గాని - వైద్య ఆరోగ్యశాఖల వద్ద గానీ ఇంతకు మించి వేరే ఎటువంటి మార్గాలూ లేవు. కరోనా మరణాల్లో గరిష్టంగా వ్యాధినిరోధకశక్తి కావలసినదాని కన్నా తక్కువ వుండటం వల్ల మాత్రమే కారణం.
వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం
ఇప్పటికిప్పుడు వ్యాక్సీన్ అందుబాటులో లేదు కాబట్టి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ప్రజల ముందున్న సవాలు ఒక్కటే! మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకునే దిశగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కావలసినవన్నీ చేయాలి. కష్టమైనా నష్టమైనా ఇది తప్ప వేరే దారే లేదు! డాక్టర్లు చెబుతున్నదీ ఇదే!
ఒక్కసారి కరోనా వైరస్ సోకిందంటే చాలు శరీరంలోని అన్ని అవయవాలకూ వ్యాపించి ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీసే ప్రమాదం వుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల నుంచి మొదలవుతుంది. కాబట్టి మన ఊపిరితిత్తులు ఎక్కువ శక్తిమంతం అయ్యేలా మనం బ్రీతింగ్ ఎక్సరసైజులు చేయాలి.
ఎంతకాదన్నా 40 నుంచి 60 శాతం ప్రజానీకానికి ఏదో ఒక స్థాయిలో ఈ వ్యాధి ఖచ్చితంగా సోకే అవకాశం వుంది. వారి వారి ఇమ్యూనిటీ స్థాయిని బట్టి వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు వుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉన్నంతలో పరిష్కారం ఏమిటి?
పసుపు - మిరియాలు - నిమ్మ (సి విటమిన్) - వెల్లుల్లి - అల్లం వినియోగం బాగా పెరగాలి. ఇవి మాత్రమే మనలోని వ్యాధినిరోధక శక్తిని కరోనాను జయించేంతగా పెంచగలవు. వేడి నీళ్లలోను - పాలలోను పసుపు కలిపి తాగడం - రోజుకు కనీసం మూడు సార్లు ఆవిరి పట్టడం, వీలున్నప్పుడల్లా వేడి నీళ్లు తాగడం చేయాలి .
కరోనా ముఖ్యంగా శ్వాసకోశసంబంధిత వ్యాధి కాబట్టి యోగ లోని ప్రాణాయామం తదితర బ్రీతింగ్ ఎక్సరసైజులు రోజుకు 10 నిమిషాల నుండి 30 నిమిషాల వరకూ చేయాలి. మనిషి వ్యాయామం - సరైన నిద్ర - ప్రశాంత పరిస్థతులతోపాటు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
బలవర్ధకమైన ఆహారం అంటే మూడు పూటలా కుంభాలు కుంభాలు తిని పొట్టలు పెంచడం కాదు. అందులోనూ అన్నం (బియ్యం) అధికంగా అసలు తినకూడదు. పౌష్టిక, సమతుల ఆహారం మాత్రమే తీసుకోవాలి దానికి తోడు ఏదో ఒక రూపంలో ఇంట్లో అయినా సరే ఒక గంట సేపు వ్యాయామం చేయాలి. వ్యాధినిరోధక శక్తిని తగ్గించే షుగర్ - ఆయిల్స్ - బరువు - బీపీ పెంచే ఆహారపుటలవాట్లను పూర్తిగా మానుకోవాలి.
- వి ఎస్ రావ్