ఏపీలో కరోనా డేంజర్ రెడ్ జోన్లు ఇవే

Update: 2020-04-12 08:19 GMT
ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లింకులతో కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

లాక్ డౌన్ ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా 133 రెడ్ జోన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రెడ్ జోన్లలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 30 ప్రాంతాలు ఉండడం గమనార్హం. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువగా రెడ్ జోన్లు ఉన్నాయి. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇక్కడి నుంచి 3కి.మీ ల చుట్టు ఉన్న ప్రాంతాలను కంటెయిన్ క్లస్టర్లుగా పిలువనున్నారు.  

ఇక పట్టణాలు, నగరాల్లో వైరస్ వ్యాప్తికి  అవకాశం ఉన్న 5 కి.మీల ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

ఏపీలో రెడ్ జోన్ల వివరాలివీ..

-నెల్లూరు 30.
కర్నూలు 22.
 కృష్ణా 16.
 పశ్చిమ గోదావరి 12.
గుంటూరు 12.
 ప్రకాశం 11.
తూర్పుగోదావరి 8.
చిత్తూరు 7.
విశాఖపట్టణం 6.
కడప 6.
అనంతపురం 3


Tags:    

Similar News