వరల్డ్ అప్డేట్: 1.60లక్షల మృతులు..23.31 లక్షల కేసులు

Update: 2020-04-19 07:24 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు దీని తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రపంచదేశాల్లో మరణ మృదంగం వినిపిస్తూనే ఉంది. అమెరికా - ఐరోపా దేశాల పరిస్థితి దయనీయంగా ఉంది. అమెరికా - ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ - బెల్జియం దేశాల్లో అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

*ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక్కడ 7.38 లక్షల మందికి కరోనా సోకగా.. దాదాపు 40వేల మంది చనిపోయారు. ఒక్క వాణిజ్య రాజధాని న్యూయార్క్ లోనే 2.41 లోల కేసులు 17600మంది చనిపోయారు.

*చైనాలోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 27 కేసులు నమోదయ్యాయని.. 4వేల కేసులు దాటాయని తెలిపింది.

* స్పెయిన్‌ లో 194,416 - ఇటలీలో 175,925 - ఫ్రాన్స్‌ లో 151,793 - జర్మనీలో 143,724 - బ్రిటన్‌ లో 114,217 - చైనాలో 82,735 - టర్కీలో 82,329 - ఇరాన్ 80,329 - బెల్జియం 37,183 - బ్రెజిల్ 36,925 - రష్యా 36,793 - కెనడా 33,383 - నెదర్లాండ్ 31,589 - స్విట్జర్లాండ్ 27,404లో కేసులు నమోదయ్యాయి.

*భారత్ లో 15వేలు దాటిన కేసులు

భారత దేశంలో కరోనా కేసులు విస్తరిస్తూనే ఉన్నాయి.తాజాగా దేశంలో ఆదివారం మధ్యాహ్నానికి 15723 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 521కు చేరింది. దాదాపు 2231మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 3648 కేసులు నమోదయ్యాయి. 211 మంది మరణించారు.

*తెలంగాణలో 809కి కేసులు

తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొత్తం మరణాల సంఖ్య 18కి చేరింది. 186మంది కరోనా నుంచి కోలుకొని బయటపడ్డారు. తెలంగాణలో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది.

*ఏపీలో 647కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 647కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 17మంది చనిపోయారు. 65మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 44మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కర్నూలులో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News