వంద మందిలో ఒక‌రికి క‌రోనా..వెయ్యి మందిలో ఒక‌రు మృతి

Update: 2020-04-15 00:30 GMT
క‌రోనా వైర‌స్ బారిన అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వ‌ణుకుతోంది. ప్ర‌పంచంలోనే అత్యంత బ‌ల‌మైన దేశంగా విర్ర‌వీగే అమెరికాను క‌రోనా వ‌ణికిస్తోంది. సాంకేతిక ప‌రిజ్ఞానం - సంప‌ద‌ - సైన్యం వంటి విష‌యాల్లో త‌మ‌దే అగ్ర‌రాజ్య‌మ‌ని పేర్కొంటున్న ఆ దేశంలో క‌రోనాను కంట్రోల్ చేయ‌లేక‌పోతున్న‌ది. ఆ దేశంలో ముఖ్య‌మైన న‌గ‌రం న్యూయార్క్‌. ప్ర‌ధానంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌గ‌రం న్యూయార్క్ రాష్ట్రం. అత్యధిక జనసాంద్రత - సాంకేతిక ప‌రిజ్ఞానంలో పేరుపొందిన న్యూయార్క్ ప్ర‌స్తుతం క‌రోనాతో తీవ్రంగా దెబ్బ‌తింది. అమెరికాలో అత్య‌ధికంగా కేసులు - మృతులు న‌మోదైన రాష్ట్రంలో న్యూయార్క్ మొద‌టి స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందంటే వంద మందిలో ఒక‌రికి క‌రోనా సోక‌గా.. వెయ్యి మందిలో ఒక‌రు మృత్యువాత ప‌డుతున్న‌ట్లు ప‌రిస్థితులు ఉన్నాయి. న్యూయార్క్‌లో క‌రోనా విల‌య తాండ‌వం ఎలా ఉందంటే.. మృతదేహాలతో ఆస్ప‌త్రుల మార్చురీల‌న్నీ నిండిపోగా.. ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితుల‌కు అందించేందుకు బెడ్లు స‌రిపోవ‌డం లేదు.

ప్రస్తుతం అమెరికాలో 5,86,941 కేసులు న‌మోదు కాగా - మృతులు 23,640 ఉన్నారు. వీటిలో 40 శాతం న్యూయార్క్ రాష్ట్రం వాటా ఉంది. ఆ రాష్ట్ర జ‌నాభా 1.94 కోట్లు. ప్ర‌స్తుతం అక్క‌డ 1,95,655 క‌రోనా కేసులు న‌మోదు కాగా - మృతులు 10,056కు చేరాయి. ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కానన్ని కేసులు ఒక్క న్యూయార్క్ నగరంలోనే న‌మోదు కావ‌డంతో అక్క‌డ ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి.

అయితే దీనికి గ‌ల కార‌ణం ప్ర‌భుత్వ వైఫ్య‌లేమేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. క‌రోనా వైర‌స్‌ను అంచ‌నా వేయ‌క‌పోవ‌డం.. క‌రోనా వ్యాపించిన త‌ర్వాత క‌ట్ట‌డి చేయ‌డంలో విఫ‌లం చెంద‌డంతోనే ప్ర‌స్తుతం ఈ దుస్థితికి కార‌ణ‌మైంద‌ని అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు అమెరికాలోని ప్రజాప్ర‌తినిధులు - పలు సంస్థ‌లు - మీడియా కూడా చెబుతోంది.

Tags:    

Similar News