ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి. దీంతో ఆ జిల్లా డేంజర్ జోన్ గా మారింది. ఒక్కరోజులోనే ఈ జిల్లాలో 26 కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక కరోనా మరణం కూడా సంభవించింది. ప్రస్తుతం ఒక్క కర్నూలులోనే 158 పాజిటివ్ కేసులు ఉండడంతో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ లోకి ఈ జిల్లా వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కర్నూలు నుంచే 26 కేసులు నమోదవ్వగా - కృష్ణా జిల్లాలో 6 - తూర్పు గోదావరి నుంచి 5 - గుంటూరు - అనంతపురం నుంచి మూడు మూడు కేసులు - విశాఖపట్టణం నుంచి కొత్తగా మరో పాజిటివ్ కేసు వెలుగుచూసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 647కు చేరాయి .ఇప్పటివరకు నమోదైన 647 కేసుల్లో 65 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జయ్యారు. 17 మంది మరణించారు. మిగతా 565 మందికి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు.
ఈ కరోనా కేసుల్లో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. ఏ జిల్లాలో లేనట్టు కర్నూలులోనే 158 కేసులు ఉండడంతో ఆ జిల్లాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ రాకతో రెడ్ జోన్లలో మరిన్ని పాజిటివ్ కేసులు తేలే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వస్తే శాంపిల్స్ సేకరణ పెరగడంతో పాటు పరీక్షల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెడ్ జోన్లలో మరిన్ని పాజిటివ్ కేసులు కూడా బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ కిట్లు కరోనా వైరస్ ను వెంటనే గుర్తించేందుకు ఆస్కారం ఉంది.
గుంటూరు 129
కృష్ణా 75
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 67
ప్రకాశం 44
వైఎస్సార్ కడప 37