బ్రేకింగ్: దేశంలో కోరలు చాచిన కరోనా..ఒక్కరోజులో అత్యధికం

Update: 2020-04-26 12:51 GMT
దేశంలో కరోనా కోరలు చాచింది. తాజాగా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం దిగ్ర్భాంతికి గురిచేసింది. ఏకంగా గత 24 గంటల్లో 1990 లో కొత్తగా కేసులు నమోదుకావడం కలకలం రేపింది. ఇక ఒక్కరోజులో  దేశంలో 49 కొత్త మరణాలు సంభవించాయి. ఇది ఇప్పటివరకు ఒక్కరోజు తీవ్రతలో అతిపెద్దదిగా అభివర్ణిస్తున్నారు. ఒక్కరోజులో 1990 కేసులు పెరగడంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,496కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 824కు చేరింది.

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో ప్రబలుతున్నప్పటి నుంచి  24 గంటల్లో 1990 అత్యధిక కేసులు  నమోదుకావడం ఇదే  మొదటిసారి అంటున్నారు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 7628 సానుకూల కేసులు నమోదయ్యాయి. 323 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 800 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో మహారాష్ట్ర 13.8 శాతంగా ఉండడం తీవ్రతకు అద్దంపడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. తరువాత  స్థానంలో పూణే, నాగ్పూర్ ఉన్నాయి. పూణే జిల్లాలో 1154 కేసులు నమోదవగా.. అందులో 73 మంది మరణించారు.

మహారాష్ట్ర తరువాత గుజరాత్ లో అత్యధికంగా 3071 కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నిన్న 91 పాజిటివ్ కేసులను గుర్తించారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసులు 2036 కాగా, అందులో 99 మంది మరణించారు. భోపాల్‌లో  ఇప్పటివరకు 1176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. దేశ రాజధాని ఢిల్లీలో  పాజిటివ్ కేసులు 2625, 54 మంది మరణించారు.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే  ఆంధ్రప్రదేశ్‌లో 1061 సానుకూల కేసులను గుర్తించారు, అందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మంది కోలుకున్నారు. తెలంగాణలో, మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 991 కు చేరాయి. అందులో 26 మంది మరణించారు. 280 మంది కోలుకున్నారు.

    

Tags:    

Similar News