తెలంగాణ‌లో తాజాగా 11 కేసులు: మొత్తం 1,096

Update: 2020-05-05 16:47 GMT
రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం మంగ‌ళ‌వారం రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క‌రోనా బులెటిన్ విడుద‌ల చేశారు. తాజాగా 11 క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని ప్ర‌క‌టించారు. 43 మంది డిశ్చార్జ‌య్యార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 439 అని వెల్ల‌డించారు.

తెలంగాణ క‌రోనా క‌ట్ట‌డిలో ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని తెలిపారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేశార‌ని.. సింగిల్ డెత్ లేకుండా క‌రీంన‌గ‌ర్ జిల్లా నిలిచింద‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు రాష్ట్రంలో ప‌క్కాగా తీసుకుంటున్నామ‌ని - క‌లెక్ట‌ర్ - వైద్యారోగ్య శాఖ అధికారులు అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న‌ట్లు వారికి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News