కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆదివారం వరకూ ఈ వైరస్ ఏకంగా 151 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 5821మంది చనిపోయారు. లక్షా 56వేల 433మంది బాధితులున్నారు. ఇందులో 5909మంది పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో నాలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాపించింది. అమెరికా, భారత్ లో ఎమర్జెన్సీ విధించారు. ఇటలీలో నిన్న ఒక్కరోజే ఏకంగా 3497 కేసులు నమోదు కాగా.. ఏకంగా 175మంది మృతిచెందడం కలకలం రేపింది. ఇరాన్ లో 1365 కేసులు 97మంది మృతి చెందారు. ఇక స్పెయిన్ లో 1159 కేసులు, 62మంది మృతి చెందారు.
ఇక భారత్ లోనూ వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటిదాకా 97 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతిచెందారు. పలు రాష్ట్రాల్లో 31వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. థియేటర్లు - పబ్ లు - మాల్స్ - స్విమ్మింగ్ ఫూల్స్ మూసివేశారు.