వ‌రంగ‌ల్‌లో క‌రోనా...ఒక్క‌రికా....ముగ్గురికా క్లారిటీ మిస్‌?

Update: 2020-03-12 17:37 GMT
తెలంగాణ‌లో క‌రోనా బాధితుత‌లు లేరు అని ఓవైపు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తుండ‌గా...మ‌రోవైపు తాజాగా ఓ కేసు వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న‌కు క‌రోనా నిర్ధారితం కాక‌పోగా..అలాంటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వరంగల్ నిట్‌లోని విద్యార్థి కేంద్రంగా ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, వ‌రంగల్ ఎన్ఐటీలో ముగ్గురు విద్యార్థులకు కరోన లక్షణాలు ఉన్నాయ‌ని ఇంకో ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో...ఏది నిజం ఏది అబ‌ద్దం అనే డైల‌మా కొన‌సాగుతోంది.

నిట్ వ‌ర్గాలు అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, కర్నూలుకు చెందిన విద్యార్థికి క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చిన ఆ విద్యార్థి తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో స్థానికంగా ఓ ప్రైవేటు హస్పిటల్ కి తరలించామని, అనంత‌రం జిల్లా వైద్యాధికారి సూచనల మేరకు వరంగల్ ఎంజీఎం ఐసోలేషన్ వార్డుకు తరలించామని నిట్ రిజిస్ట్రార్ వెల్ల‌డించారు. విద్యార్థికి వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు పేర్కొన్న ఆయ‌న నిట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్ల‌డించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు నిట్ క్యాంపస్‌లోనే ఉన్న మ‌రో ముగ్గురికి వైర‌స్ సోకింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేరళకు చెందిన రాహుల్ మీనన్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన రిషిత్ పాండే,  కర్నూలుకు చెందిన ముష్రఫ్ జాఫర్ క‌రోనా బాధితులుగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వరంగల్ ఏంజిఎంలో ఇద్దరికి చికిత్స అందుతుండ‌గా ఒకరిని హైదరాబాద్‌కు తరలించార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.



Tags:    

Similar News