అమెరికాలో కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ ను ఎత్తివేయాలని జనాలు రోడ్ల మీదకొస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ సైతం వీరికి మద్దతు తెలుపుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసి విచ్చలవిడిగా ఇలానే సాగితే అమెరికన్ల భావి పౌరులు అంటే పిల్లలు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని సంచలన పరిశోధన వెలుగుచూసింది. ట్రంప్ తోపాటు అమెరికన్ల వైఖరి కనుక మారకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో కరోనా బారినపడ్డ చిన్న పిల్లల సంఖ్య ఊహించిన దానికన్నా అధికంగా ఉందని.. ఇది భవిష్యత్తులో ఇలానే సాగితే మరింత పెరగడం ఖాయమని అమెరికా పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా అమెరికాలో నియంత్రణ కాకపోతే.. చర్యలు చేపట్టకపోతే చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉందని అధ్యయనం తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఒక్కో ఐసీయూ బెడ్ కు 2381మంది పిల్లలు పోటీపడుతారని బీతిగొలిపే నిజాన్ని అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం మార్చి 18-ఏప్రిల్ 6 మధ్య 74మంది పిల్లలు కరోనాతో ఐసీయూల్లో చేరారని.. భవిష్యత్తు అంచనాలు వేస్తే 176190 మంది పిల్లలు ఐసీయూల్లో చేరుతారని అంచనా వేశారు.
డిసెంబర్ వరకు కరోనా ఉంటే చలికాలంలో తీవ్రత అధికమవుతుందని.. దీంతో 2020 చివరినాటికి అమెరికా జనాభాలో 25శాతం మందికి కరోనా బారినపడుతారని అధ్యయనం హెచ్చరించింది. అందులో కనీసం 50వేల మంది పిల్లలు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల పాలయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా తగ్గకపోతే అమెరికన్ పిల్లలకు పెను ముప్పు ఉందని అర్థమవుతోంది.