కరోనా లైవ్ అప్డేట్స్: ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కేసులు!

Update: 2020-05-09 11:50 GMT
విజయనగరంలో తోలి కరోనా మరణం !

ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. అన్ని జిల్లాలో కూడా కరోనా వ్యాపించింది.  తాజాగా విజయనగరం జిల్లాలో కూడా కరోనాకేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.  గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనావైరస్ సోకినట్టు గుర్తించిన వైద్యులు ఆమెకు కరోనా చికిత్స అందిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు,సెకండరీ కాంటాక్ట్స్‌ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని కరోనా టెస్ట్ చేశారు. కరోనావైరస్ టెస్ట్ రిపోర్ట్ వచ్చేలోగా వారిని క్వారంటైన్‌కి తరలించారు.

 విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ మృతిగా కేసు నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌ సోకినట్టుగా గుర్తించారు. ఏపీలో కరోనావైరస్ ప్రభావం అతి తక్కువగా కనిపించిన రెండు జిల్లాలో విజయనగరం ఒకటి. ఈ రెండు జిల్లాల్లో మరొకటైన శ్రీకాకుళం జిల్లాలోనూ ఇప్పటివరకు ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా గుర్తించినట్టు అక్కడి అధికారవర్గాలు వెల్లడించాయి.

కాగా, ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1930కు చేరుకుంది. ఇందులో 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 44 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 999 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 553కు చేరింది. కృష్ణా జిల్లాలో 338, గుంటూరులో 376 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. వుహాన్ నగరంలో చిన్నగా మొదలైన కరోనా మమహ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. తనకు పేద - ధనిక దేశమనే భేద లేదంటోంది. అన్ని దేశాల్లోనూ వైరస్‌ ఉద్ధృతి కొనసాగిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకూ అమెరికా - ఐరోపా దేశాలను అల్లాడించిన ఈ వైరస్.. ప్రస్తుతం బ్రెజిల్‌ లో పంజా విసురుతోంది. గడచిన నాలుగు రోజుల్లో 20వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు.


***********ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కేసులు!

ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40,14,265కు చేరింది. వీరిలో 2,70,740 చనిపోగా..1,387,181 కోలుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా - స్పెయిన్‌ - ఇటలీ - బ్రిటన్‌ - రష్యాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్ ‌లో తాజాగా 626 మంది మృతిచెందారు.

అమెరికాలో మొత్తం 13.21 లక్షల మందికి వైరస్ సోకగా.. వీరిలో 78,615 మంది చనిపోయారు. బ్రిటన్‌ లో 31,241 మంది - ఇటలీలో 30,201 మంది - స్పెయిన్‌ లో 26,299 మంది - ఫ్రాన్స్‌ లో 26,230 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల లిస్ట్‌లో చైనా - కెనడా - బెల్జియంలు ఉన్నాయి. మరోవైపు భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,695లకు చేరింది.  మరోవైపు, ఆంక్షలను సడలించడం వల్ల వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంక్షలను సడలించిన అనంతరం పలు దేశాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే , ప్రపంచంలోని పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా కి సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు దీని విజృంభణ ఇలాగే కొనసాగుతుంది అని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

*************714 మంది పోలీసులకి కరోనా!

దేశంలో  కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటివరకు 19,063 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా,  731 మంది కరోనా మహమ్మారి కారణంగా  ప్రాణాలు విడిచారు. అయితే , కరోనా పోరులో ప్రజలు ప్రాణాల కోసం తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి విధి నిర్వహణలో పాల్గొంటున్న  మహారాష్ట్ర పోలీసు విభాగంలోనూ కరోనా కలకలం రేపుతోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా

ఇప్పటివరకు 714 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు గుర్తించారు. వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయిలో 55 ఏళ్లకు పైబడిన పోలీసులను ఇంటి వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. ఒక్క ముంబయిలోనే 11 వేలకు పైగా కేసులు నమోదవడం ఇక్కడి దారుణ పరిస్థితులకు నిదర్శనం. కాగా ,లాక్ డౌన్ అమల్లోకి వచ్చాక పోలీసులపై దాడులు కూడా జరిగాయి. వివిధ సందర్భాల్లో పోలీసులపై 194 దాడి ఘటనలు జరిగాయని, దాడులకు పాల్పడిన 689 మందిని అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు.  ఇక భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 60,000 మార్కుకు చేరుకుంది.

**********పుణ్యం కోసం కాశీ యాత్రకి పొతే కరోనా వెంటొచ్చింది!

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత పది రోజులుగా ప్రతి రోజు సరాసరి 50 కేసులకు తక్కువకాకుండా నమోదు అవుతున్నాయి. కాగా , ఏపీలో ఇప్పటివరకు 1930 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 887 మంది కరోనా కి చికిత్స తీసుకోని డీఛార్జ్ కాగా.. 999 మంది కరోనా కి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో 44 మంది మృతిచెందారు.

ఇకపోతే , గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు నమోదుకాకపోవడంతో కరోనా నుండి బయటపడ్డాం అని ఆనందపడుతున్న పచ్చిమ గోదావరి జిల్లా వాసులు శుక్రవారం ఒకేసారి 9 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన పడుతున్నారు. శుక్రవారం ఏకంగా 9మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. బాధితులు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లి వచ్చినవారిగా గుర్తించారు. జిల్లాలోని గోపాలపురం, ఉండ్రాజవరం, ఎస్‌.ముప్పవరం ప్రాంతాలకు చెందిన 10 మంది, తూర్పుగోదావరి జిల్లా పలివెలకు చెందిన ఓ మహిళ మార్చి 17న పుణ్యాక్షేత్రాల సందర్శనకు వెళ్లారు .

అయితే, కరోనా లాక్ డౌన్ కారణంగా కాశీలో చిక్కుకుపోయారు.ఈ నెల 2న కాశీలో ఒక వ్యాన్‌ మాట్లాడుకుని స్వస్థలాలకు బయలుదేరారు. ఈ నెల 4న కృష్ణా జిల్లా సరిహద్దులో వీరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 10 మందిని తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ కు, ఒకరిని తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు క్వారంటైన్ ‌కు తరలించారు. పశ్చిమగోదావరికి చెందిన 10 మందితోపాటు వ్యాన్‌ డ్రైవర్‌ ను క్వారంటైన్‌ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ వ్యాన్ డ్రైవర్‌ తో పాటు తొమ్మిది మందికి పాజిటివ్‌ తేలింది. ఇద్దరికి మాత్రం నెగిటివ్‌ నిర్థారణ అయ్యింది. కాగా, శనివారం ప్రకటించిన కరోనా ఫలితాల్లో జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కాగా జిల్లాలో ఇప్పటివరకు  68 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.. తాజాగా నమోదైన  9 కేసులతో కలిపి 36 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి.


*******ఏపీలో రెండువేలకు దగ్గరైన కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.  గడిచిన 24 గంటల్లో 9388 మంది శాంపిల్స్ ను వైద్యులు పరీక్షించగా.. 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో పేర్కొంది.

దీంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1930కి చేరింది.  రెండు వేల కేసులకు చేరువైంది. ప్రధానంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరులో 11 - విశాఖపట్నంలో 5 - అనంతపురంలో 3 - గుంటూరులో 2 నమోదయ్యాయి. మొత్తం ఏపీ వ్యాప్తంగా అత్యధిక కేసులు 553తో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది.  తర్వాత కృష్ణ - గుంటూరు జిల్లాలున్నాయి.

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఇద్దరు - కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 44కు చేరింది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 887మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 999మంది చికిత్స పొందుతున్నారు.



***********కరోనా ఇండియా: 60వేలకు కేసులు.. 5 రాష్ట్రాల్లో ఉధృతం

భారత దేశంలో కరోనా వైరస్ విస్తృతి తగ్గడం లేదు. లాక్ డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.  తక్కువ సమయంలోనే రెట్టింపు కేసులు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల కింద 12 రోజులకు డబుల్ అయిన కేసులు ప్రస్తుతం 10రోజులకే డబుల్ అవుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 60వేలకు చేరువ అవుతోంది. నేటికి కరోనా కేసుల సంక్య 59,662మందికి చేరింది.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 1985మంది ప్రాణాలు కోల్పోయారు. 17887మంది కోలుకున్నారు.

గడిచిన 5 రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు సగటున 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన 64.67 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లోనే కావడం గమనార్హం. ఇందులో జనసాంద్రత ఎక్కువగా మహానగరాలే ఎక్కువ. ముంబై, ఢిల్లీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.  మహారాష్ట్ర, గుజరాత్ లోనే కరోనా కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 1089 కేసులు నమోదయ్యాయి. 784 ఇందులో ముంబైలోనే ఉన్నాయి. 24గంటల్లో 37మంది చనిపోయారు. మొత్తం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 19వేలు దాటింది. మొత్తం 731మంది మరణించారు. గుజరాత్ లో 7012 కేసులు నమోదు కాగా 425మంది మరణించారు.

*ఏపీలో పెరుగుతున్నకరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 1887 మందికి కరోనా కేసుల సంఖ్య చేరింది. ఇప్పటివరకు కరోనా 38మంది మరణించారు. 780మంది కరోనా నుంచి కోలుకున్నారు.

*తెలంగాణలో స్థిరంగా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 1132 కేసులు నమోదు కాగా.. 29మంది తెలంగాణలో కరోనా తో చనిపోయారు. 727మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

*ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ మొత్తం 40 లక్షల మంది వైరస్ బారినపడగా.. 2.76 లక్షల మంది బలయ్యారు. మరో 14 లక్షల మంది కోలుకోగా.. 23 లక్షల మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

రష్యాలో కొత్తగా 10 వేలకిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 1.87 లక్షలు దాటగా.. మరో 1,723 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా - స్పెయిన్‌ - ఇటలీ - బ్రిటన్‌ - రష్యాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్‌ లో తాజాగా 626 మంది మృతిచెందారు. అమెరికాలో మొత్తం 13.21 లక్షల మందికి వైరస్ సోకగా.. వీరిలో 78,615 మంది చనిపోయారు. బ్రిటన్‌ లో 31,241 మంది - ఇటలీలో 30,201 మంది - స్పెయిన్‌ లో 26,299 మంది - ఫ్రాన్స్‌ లో 26,230 మంది ప్రాణాలు కోల్పోయారు.

**********దక్షిణ కొరియాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

కరోనా వైరస్‌ ను ఆదిలోనే కట్టడిచేసిన దక్షిణ కొరియా.. మిగతా దేశాలకు మోడల్‌ గా నిలిచింది. టెస్టింగ్ - ట్రేసింగ్ - ట్రీట్‌ మెంట్ విధానంతో ముందుకెళ్లింది. అయితే, మళ్లీ కొత్తగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్టు ఆ దేశం వెల్లడించింది. కొత్తగా 18 కేసులు నమోదయినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,840కి చేరగా... 256 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులలో ఎక్కువ భాగం సియోల్‌లోని నైట్‌ క్లబ్‌ తో సంబంధం ఉన్నట్టు తెలిపారు.
 
*******బ్రేకింగ్: కళ్ల ద్వారా కరోనా వ్యాప్తి

కష్టమొస్తే కన్నీళ్లు కారుస్తాం.. కరోనా టైంలో ఇటలీ సహా అమెరికా కొన్ని భీకరంగా ప్రబలిన దేశాల్లో ఇదే చేశారు. కానీ ఆ కళ్లు కూడా కరోనా వ్యాప్తికి కారణమనే సంచలన నిజం తెలిసింది.

కాదేది కరోనా రావడానికి అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది. ఇన్నాళ్లు దగ్గితే - తుమ్మితే - జలుబు - షేక్ హ్యాండ్ - కౌగిలింతలు మనిషి నుంచి మనిషి అంటువ్యాధిలా కరోనా వ్యాపిస్తుందని తెలుసు..కానీ తాజాగా కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందన్న సంచలన  విషయం వెలుగుచూసింది..

కరోనా ముక్కు, నోటి ద్వారానే సోకుతుందని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లు భావించారు.  కానీ తాజాగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు సంచలన విషయం కనిపెట్టారు. కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని తేల్చారు.

కళ్లపై కంజంక్లివా అనే సన్నటి - స్పష్టమైన కణజాలంపై సార్స్ చేసిన దాడి కంటే కరోనా దాడి 100 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. అందరూ ముక్కు - నోటిని మాస్కుతో మూసుకుంటున్నారని.. కానీ కళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని.. ఆ కళ్ల ద్వారా కూడా కరోనా దాడి చేస్తోందని తెలిపారు. దీంతో ఇక నుంచి కళ్లకు కూడా కళ్లద్దాల లాంటివి రక్షణగా పెట్టుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News